Google Maps: గూగుల్ మ్యాప్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్!

గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ వెళుతోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. దీని ప్రకారం మనమెక్కడున్నామో తెలియజేయడానికి, రియల్ టైమ్ లొకేషన్ షేర్ చేయడానికి వేరే యాప్‌లు వాడక్కర్లేదని.. గూగుల్ మ్యాప్స్ లోంచే షేర్ చేసేయొచ్చు.

New Update
Google Maps: గూగుల్ మ్యాప్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్!

Google Maps:గూగుల్ మ్యాప్స్‌ ను తలదన్నే యాప్ మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ౠదారపడే ఒకే ఒక్క మ్యాప్ యాప్ గూగుల్. దీని తరువాత ఇలాంటి చాలా వచ్చినా నిలబడలేకపోయాయి. దీనిరి తోడు గూగుల్ మ్యాప్స్ తనను తాను ఎప్పుటికప్పుడు మెరుగుపర్చుకుంటూ...కొత్త ఫీచర్స్లను యాడ్ చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

Also read:16 ఏళ్ళ బాలి మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే..రూట్‌ తెలియకపోతే వెంటనే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్‌ షేర్‌ చేయమని అడుగుతూంటాం. అవతలి వాళ్ళు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తారు. ఒకవేళ ఇందులో కనుక వెళ్ళకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఇక మీదట అలాంటి ప్రాబ్లెమ్స్ రావని అంటోంది గూగుల్. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్‌ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్‌ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. కానీ ఇక మీదట నుంచి డైరెక్ట్‌గా గూగుల్ మ్ఆప్స్ నుంచే లొకేషన్ షేర్ చేసేయవచ్చును.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. ఫ్రొఫైల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి అందులో లొకేషన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్‌పై క్లిక్‌ చేసి సమయాన్ని సెట్‌ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్‌ యు టర్న్‌ దిస్‌ ఆఫ్‌’ ఆప్షన్‌ ఎంచుకొని కాంటాక్ట్‌ సెలెక్ట్‌ చేసుకొని మెసేజ్‌ పంపించాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

New Update
meta

meta

అసలే ఒక పక్క అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దానికి తోడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇందులో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మీదనే ఏకంగా సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. జుకర్ బర్గ్ అమెరికా జాతీయ భద్రత గురించి ఆలోచించలేదని...అమెరికన్లను మోసం చేస్తున్నారని మెటాలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ అధికారుల చేతుల్లోకి వెళుతోందని అన్నారు. 

మెటా చైనాతో చేతులు కలిపింది..

మెటా ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కొంటోంది. గోప్యతా విధానం, అనైతిక వ్యాపా విలువలు లాంటి అంశాల్లో మెటా యూఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ వెట్ నెస్ గా మారి జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడే ఆయనపై విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కారని...అమెరికా విలువలకు ద్రోహం చేయండ తాను చూశానని విలియమ్స్ చెప్పారు. మెటా చైనీస్‌ ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుందని చెప్పారు. జుకర్ బర్గ్ అమెరికా దేశ భక్తుడు అని చెబుతారు కానీ చైనాలో 18 బిలియన్ డాలర్ల   వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకొంటున్నారని విలియమ్స్ ఆరోపించారు.

today-latest-news-in-telugu | meta | mark-zuckerberg

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

 

Advertisment
Advertisment
Advertisment