Google Layoffs: గూగుల్ ఉద్యోగులపై పెద్ద దెబ్బ.. మొత్తం టీమ్ అవుట్!

గూగుల్ తన ఖర్చులు తగ్గించుకోవడానికి, తక్కువ జీతాలతో ఉద్యోగులను తిరిగి నియమించుకోవడానికి వీలుగా తన పైథాన్ టీమ్ మొత్తాన్ని తొలగించింది. పైథాన్ అనేది అధునాతనమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వారం క్రితం కూడా గూగుల్ 28మంది ఉద్యోగులను తొలగించింది. 

New Update
Google Layoffs: గూగుల్ ఉద్యోగులపై పెద్ద దెబ్బ.. మొత్తం టీమ్ అవుట్!

Google Layoffs: టెక్ కంపెనీ గూగుల్ గత కొన్ని వారాల్లో తన మొత్తం పైథాన్ టీమ్‌ను తొలగించింది. తక్కువ పే అవుట్ తో ఉద్యోగులను నియమించుకోవడానికి.. ఖర్చులను తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రీ ప్రెస్ జర్నల్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, Google ఖర్చు తగ్గింపు కోసం US వెలుపల నుండి చౌకగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. పైథాన్ అత్యంత అధునాతనమైన, సాధారణ ప్రయోజన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ Google బృందంలో దాదాపు 10 మంది(Google Layoffs) వ్యక్తులు పనిచేస్తున్నారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో గూగుల్ మొదటి నుండి కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇంతకు ముందు, ఈ బృందంలోని 10 మంది కంటే తక్కువ మంది పైథాన్ మొత్తం వ్యవస్థను నడుపుతున్నారు. Googleలోని ఈ బృందం పైథాన్ స్థిరమైన సంస్కరణను నిర్వహించడం, వేలాది థర్డ్ పార్టీ ప్యాకేజీలను నవీకరించడం అలాగే,  టైప్ చెకర్‌ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది.

Also Read: బాబా రామ్‌దేవ్‌ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్!

వారం క్రితం 28 మంది ఉద్యోగుల తొలగింపు.. 

ఇటీవల కంపెనీ 28 మంది ఉద్యోగులను(Google Layoffs) తొలగించింది. ఈ ఉద్యోగులందరూ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి - సైన్యానికి క్లౌడ్ సేవలను అందించే ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీని తరువాత, కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ తన బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో, రాజకీయాలను పని స్థలం (కార్యాలయం) నుండి దూరంగా ఉంచాలని ఉద్యోగులను కోరారు. ఇందులో ఓ విధంగా ఉద్యోగులను కార్యాలయానికి వచ్చి తమ పనులు చేసుకోవాలని, రాజకీయాల్లోకి రావద్దని ఆదేశించారు. 'మిషన్ ఫస్ట్' పేరుతో పిచాయ్ తన నోట్‌లో  ఇలా అన్నారు.  “కంపెనీ విధానం మరియు అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. పదవిలో రాజకీయాలకు తావు లేదు.”

గూగుల్  జనవరి 2023లో 12,000 మందిని తొలగించింది..
2023 ప్రారంభంలో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను(Google Layoffs) తొలగించింది. ఈ తొలగింపు గురించి మాట్లాడుతూ, “ఏ సంస్థకైనా ఇది సవాలుతో కూడిన సమయం అని అన్నారు. గత 25 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవి” అని అప్పట్లో సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!

ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్  చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం రూ.3 వేల వరకు ఉన్న టికెట్ ధర దాదాపు రూ.7 వేలు కానుంది. టాలీవుడ్‍తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం ఉంటుంది.

New Update
trump tollywood

Trump tariff decision impact on Telugu cinema

Trump effect on Tollywood: ట్రంప్ తీసుకున్న 100 శాతం టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్  చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం రూ.3 వేల వరకు ఉన్న టికెట్ ధర దాదాపు రూ.7వేలు కానుంది. టాలీవుడ్‍తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం పడనుంది. 

ఫారిన్ సినిమాల ద్వారానే భారీ రెవెన్యూ

అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్‍ ఉంది. ఓవర్సీస్ వసూళ్లలో టాలీవుడ్‍ సినిమాలతో అమెరికాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. చిన్న సినిమాల టికెట్ ధర15 డాలర్లు ఉంటే.. పెద్ద హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, తదితుల చిత్రాలలకు 25 నుంచి 35 డాలర్లు డిమాండ్ ఉంటుంది. కానీ ఈ టారిఫ్ కారణంగా 15 డాలర్లు 30, 30 డాలర్ల టికెట్ ధర 70 దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేరు. దీంతో అమెరికాకు కూడా ఆర్ధిక నష్టం తప్పదు. ఎందుకంటే అమెరికా సినీ ఇండస్ట్రీకి ఫారిన్ సినిమాల ద్వారానే  భారీ రెవెన్యూ అందుతుంది. ఇటీవల విడుదలైన 'పుష్ప' అమెరికాలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్  చేసింది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లో ఏకంగా 6.03 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ఇప్పటివరకు ఇదే అత్యధికం. 'కల్కి 2898 AD' తర్వాత ఉత్తర అమెరికాలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. ఎన్టీఆర్ 'దేవర' చిత్రాన్ని కూడా అధిగమించింది.

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

'తెలుగు చిత్రాలపై 100 శాతం టారిఫ్ విధిస్తే టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి. ట్యాక్స్ భారం డిస్ట్రిబ్యూటర్లు భరిస్తే లాభాలు తగ్గుతాయి. యూఎస్ థియేట్రికల్ రైట్స్ వల్ల సినిమాలకు ఆదాయం తగ్గుతుంది. అయితే ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే క కాదు ఇండియాను సినిమాపై కూడా ప్రభావం ఉంటుంది' అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సినిమాలపై 100 శాతం సుంకాలు..

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్‌ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు అమెరికా ఇండస్ట్రీలు తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధించబడుతుందని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను విదేశాలకు ఆకర్షించి, లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తన ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

 Donald Trump | cinema | tax | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment