ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment