Special Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్... దసరాకు ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దసరాకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. దసరా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ. ఇలాంటి పండుగకు దేశ నలుమూలల ఉన్న తెలంగాణ వాసులు సొంతూళ్లకు వచ్చి బంధువులతో విజయదశమిని జరుపుకుంటారు.

New Update
Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దసరాకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. దసరా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ. ఇలాంటి పండుగకు దేశ నలుమూలల ఉన్న తెలంగాణ వాసులు సొంతూళ్లకు వచ్చి బంధువులతో విజయదశమిని జరుపుకుంటారు. దసరా సమీపిస్తుండటంతో ఇంతకు ముందే ప్రకటించిన రైళ్లన్నీ బుక్‌ కావడంతో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లును ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ వెళ్లవద్దని, అందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించింది. సుదూర ప్రాంతాల నుంచి బస్సు ద్వారా వచ్చే ప్రయాణికులు రెండు నెలల ముందే రిజర్వేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం ప్రయాణికులు పడుకుని ప్రయాణం చేయటానికే మొగ్గు చూపుతారు. దీంతో బస్సు ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపించరు. దీంతో అధిక శాతం మంది ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగూణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే..

ట్రైన్ నెం.08579: విశాఖపట్నం-సికింద్రాబాద్ (అక్టోబరు 4 నుంచి నవంబరు 29 వరకు ప్రతి బుధవారం) రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ వస్తాయి. ట్రైన్ నెం.03225: దానాపూర్-సికింద్రాబాద్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు), ట్రైన్ నెం.08580: సికింద్రాబాద్-విశాఖపట్నం (అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు), ట్రైన్ నెం.03253: పాట్నా-సికింద్రాబాద్ (అక్టోబరు 2 నుంచి డిసెంబరు 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో), హైదరాబాద్-పాట్నా స్పెషల్ ట్రైన్- అక్టోబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు ప్రతి బుధవారం, ట్రైన్ నెం.03226: సికింద్రాబాద్-దానాపూర్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు), ట్రైన్ నెం.07255: సికింద్రాబాద్-పాట్నా (అక్టోబరు 6 నుంచి డిసెంబరు 8 వరకు ప్రతి శుక్రవారం)

Advertisment
Advertisment
తాజా కథనాలు