Bengaluru : బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్..రానున్న రోజుల్లో వర్షాలు బెంగళూరు నీటి కష్టాలు తీరుతాయి అంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలకు చెక్ పెడుతూ బెంగళూరులో వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రలో మొదలైన వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపిస్తాయని చెబుతోంది. By Manogna alamuru 19 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rains In Bengaluru : భారతదేశం(India) లో గ్రీన్ సిటీ ఏడి(Green City AD) అంటే టక్కున అందరూ చెప్పే సమాధానం బెంగళూరు(Bengaluru). రాష్ట్రం నిండా చెట్లు, పచ్చదనంతో అలరారే బెంగళూరు కొన్ని రోజులుగా ఎండలకు మలమల మాడిపోతోంది. దాంతో పాటూ విపరీతమైన నీటి కష్టాలు. నిత్యావసరాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. బాత్రూమ్‌కు వెళ్ళడానికి కూడా వాటర్‌ను కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక ఈ కష్టాలకు చెక్ అంటోంది వాతావరణ శాఖ(Department of Meteorology). బెంగళూరును వర్షాలు(Rains) పలకరించనున్నాయని చెబుతోంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణల్లో పడుతున్న వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపించనున్నాయని తెలిపింది. వరుసగా ఏడు రోజుల పాటూ వానలు పడతాయని తెపింది. ఈ వారమంతా మేఘావృతమై ఉంటుందని... వీకెండ్(Weekend) లో బారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది ఐఎండీఏ. మార్చి 20వ తేదీ నుంచి వాతావరణం మారిపోతుందని తెలిపింది. చామరాజనగర్, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మాండ్య, మైసూరు, తుమకూరు, బెంగళూరు వంటి జిల్లాల్లో బుధవారం నుంచి ఆదివారం వరకు మార్చి 20 నుంచి 23 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అయితే ఈ పరిస్థితులు ఎండలను పెద్దగా తగ్గించవు కానీ.. కాస్త ఉపశమనం కలిగిస్తుందని అంటోంది. 2023లో ఎల్‌నినో(LNINO) కారణంగా బెంగళూరులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్లే అక్కడ ప్రజలుకు నీటి కొరత ఏర్పడింది. 2024 కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఏడాది మొదట్లో అక్కడ వర్సాలు పడాల్సి ఉండగా...అస్సలు కురవలేదు. కానీ ఇప్పుడు ఆ కొరత తీరనుంది. ఈ నెలాఖరులో మరియు ఏప్రిల్ ప్రారంభంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఉగాది(Ugadi) కి కూడా మంచి వర్సాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. లా నినా కారణంగా ఈ ఏడీది రుతుపవనాల సమయంలో కూడా మంచి వర్సాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఇది కర్ణాటక, బెంగళూరు వాసులకు మంచి వార్త అని చెబుతోంది. ప్రస్తుతానికి బెంగళూరులో నీటి కొరత చాలా ఉంది. దీనిని తీర్చడానికి ప్రభుత్వం నీటి ధరలను తగ్గించడం, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం లాంటివి చేస్తోంది. ఇప్పుడు, ఏప్రిల్‌లో వర్షాలు పడినా... మళ్ళీ మేలో ఇదే పరిస్థి ఎదురుకావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచి నీటి కొరత రాకుండా తగిన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. #rains #bengaluru #weather-report #water-problem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి