Jobs: 10,391 ఖాళీలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి..శాలరీ రూ.56,900! మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు EMRS రిక్రూట్‌మెంట్ 2023 ప్రక్రియ ఆగస్టు 18తో ముగియనుంది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు EMRS అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్, TGT లాంటి ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి. By Trinath 16 Aug 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EMRS Recruitment 2023: దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాల(EMRS)ల్లో సిబ్బంది నియామకానికి భారీ నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) EMRS రిక్రూట్‌మెంట్ 2023 కోసం అధికారిక ప్రకటనను emrs.tribal.gov.in వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అధికారిక వెబ్‌సైట్ www.emrs.tribal.gov.in ను విజిట్ చేయాలి. PGT, అకౌంటెంట్, JSA, ఇతర స్థానాలకు, ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్ట్ 18. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ (TGT) సహా మొత్తం 6,329 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(NESTS) నోటిఫికేషన్ ఇచ్చింది. ఆకర్షణీయ వేతనాలతో ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్‌తో పాటు మొత్తం 4,062 పోస్టులకు గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల గడువు ఆగస్టు 18తో ముగియనుండగా.. టీజీటీ, లైబ్రేరియన్, హాస్టల్ వార్డెన్ సహా మొత్తం 6,329 పోస్టులకు దరఖాస్తుల గడువు కూడా ఆగస్టు 18 వరకు ఉంది. ➡ ఖాళీల వివరాలు: • ప్రిన్సిపాల్- 303 పోస్టులు • పీజీటీ(PGT) - 2266 పోస్ట్‌లు • అకౌంటెంట్- 361 పోస్టులు • జేఎస్‌ఏ(JSA) - 759 పోస్ట్‌లు • ల్యాబ్ అటెండెంట్- 373 పోస్టులు ➡ ఇక రెండో నోటిఫికేషన్ కోసం పురుషుల హాస్టల్ వార్డెన్‌కు 335, మహిళా హాస్టల్ వార్డెన్‌కు 334 స్థానాలు ఉన్నాయి. TGT ఖాళీలలో హిందీ (606), ఇంగ్లీష్ (671), గణితం (686), సోషల్ స్టడీస్ (670), సైన్స్ (678) లాంటి వివిధ సబ్జెక్టులు ఉన్నాయి. అదనంగా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, తెలుగు, ఉర్దూ లాంటి భాషల్లో సంగీతం, లాంటి ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి. ➡ వయసు: • ప్రిన్సిపాల్ - 50 సంవత్సరాలు • PGT - 40 సంవత్సరాలు • అకౌంటెంట్ - 30 సంవత్సరాలు • JSA - 30 సంవత్సరాలు • ల్యాబ్ అటెండెంట్ - 30 సంవత్సరాలు ➡ జీతం • ప్రిన్సిపాల్ - రూ. 78,800-2,09,200 • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) - రూ 47,600-1,51,100 • అకౌంటెంట్ - రూ. 35,400-1,12,400 • JSA - రూ. 19,900-63,200 • ల్యాబ్ అటెండెంట్ - రూ. 18,000-56,900. Also Read: ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎప్పుడంటే? #jobs #emrs-recruitment-2023 #teaching-jobs #emrs-jobs #emrs-recruitment #emrs-recruitment-2023-apply-online #emrs-recruitment-2023-notification #emrs-recruitment-last-date మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి