Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే?

శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది.

New Update
Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే?

Gold Rate Today: వివాహాల సీజన్‌ మొదలైంది. నగలు, ఆభరణాలు కొనే వారు ఎక్కువ అయ్యారు. ఈ మధ్య కాలంలో పసిడి ప్రియులకు పెరుగుతున్న ధరలు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకూ బంగారం ధరలు (Gold rates) కొండెక్కి కూర్చుంటున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పైపైకి పోతుడడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

గురువారం తో పోల్చుకుంటే.. శుక్రవారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960కు చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక ఒకటి రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ. 62 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

Also read: టీటీడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ …మీరు అర్హులా..వెంటనే ఆప్లై చేయండిలా!

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో (Chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 ,000 ఉండగా , 24 క్యారెట్ల బంగారం రూ. 62 ,200 గా నమోదు అయ్యింది. ముంబయిలో (Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800 గా నమోదు కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,110గా ఉంది. కోల్ కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం బంగారం ధర రూ.56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960గా నమోదైంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,960గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు బాగానే నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ లో (Hyderabad) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800 గా ఉండగా..24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,960గా ఉంది.

బంగారం ధరలు ఇలా ఉండగా వెండి ధరలు కూడా ఒకే రోజులో రూ.500 పెరిగి రికార్డు సృష్టించింది. దీంతో చెన్నైలో ఈరోజు కిలో వెండి ధర రూ. 78,000కు చేరుకుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,100గా నమోదైంది. హైదరాబాద్ లో 78,000 గా నమోదు అయ్యింది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

Also read: ఇవాళ్టి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు