AP : పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. By Bhavana 12 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Gold Seized : ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసుల తనిఖీలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ ఏపీలో ధన ప్రవాహం జోరుగా జరుగుతుంది. బంగారం, డబ్బు , లిక్కర్ ప్రవాహం ఏరులై పారుతుంది. అధికారులు ఎన్నిరకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ దొడ్డి దారిన వెళ్లేవి వెళ్తునే ఉన్నాయి. తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లా(Kakinada District) పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం(Gold) లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 46 కేజీల వెండిని కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం, వెండిని బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు వివరించారు. నిందితులు కాకినాడ నుంచి విశాఖపట్నం(Visakhapatnam) వైపు వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆ వాహనంలో తనిఖీలు చేసినట్లు వివరించారు. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని ఆర్డీవో కార్యాలయానికి తరలించామని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఎన్నికల వేళ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పెద్దాపురంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. Also read: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ! #police #kakinada-district #elections #gold-seized #silver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి