Gold Rates Today : దిగివస్తున్న బంగారం.. ఈరోజు ఎంత తగ్గింది అంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 13) కూడా దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200లు తగ్గి రూ.56,750లకు, 24 క్యారెట్ల బంగారం .220ల వరకూ తగ్గి రూ.61,910లకు దిగి వచ్చింది.. వెండి కూడా కేజీ రూ.77,700ల వద్ద ఉంది. By KVD Varma 13 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Hyderabad : బంగారం అంటే మన దేశంలో విపరీతమైన క్రేజ్. బంగారానికి ఇటు అలంకరణగానూ.. అటు వ్యాపారంగానూ చాలా ప్రాధాన్యత ఇస్తారు మన దేశ ప్రజలు. కొద్దిగా బంగారం ఇంట్లో ఉంటె ఆపదలో ఆడుకుంటుంది అని చాలామంది అనుకుంటారు. అందుకోసమే పండగ వచ్చినా.. పెళ్లి అయినా.. ఏదైనా అనుకోకుండా కొంత మొత్తం డబ్బు చేతికి అందినా వీలైనంత వరకూ బంగారం కొనడానికి చూస్తారు. ఈ డిమాండ్ హెచ్చు తగ్గులతో బంగారం ధరలు కూడా ప్రతి రోజూ ప్రభావితం అవుతూ వస్తాయి. పండగల సీజన్ లో ఒకలా.. పెళ్లిళ్ల సీజన్ లో ఒకలా బంగారం ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అదీకాకుండా ప్రతిరోజూ బంగారం ధరల్లో మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు.. స్థానికంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరల్లో(Gold Rates Today)హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇక వెండికి కూడా మనదేశంలో డిమాండ్ బాగానే ఉంటుంది. బంగారం ధరల్లానే వెండి ధరలు కూడా నిత్యం మారుతూ వస్తాయి. ఇవి కూడా ప్రపంచ స్థాయిలో ఉండే ఒడిదుడుకుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు(Gold Rates Today) భారీగా పడిపోతున్నాయి. అలాగే, దేశీయంగా డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం 220 రూపాయల వరకూ తగ్గుదల కనబర్చగా.. వెండి కూడా అదేదారిలో కేజీకి 200 రూపాయల మేర తగ్గింది. ఈరోజు అంటే మంగళవారం (డిసెంబర్ 13) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200లు తగ్గింది. దీంతో రూ.56,750లకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220ల వరకూ తగ్గింది. దీంతో రూ.61,910ల వద్ద నిలిచింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rates Today) తగ్గుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి రూ.56,950ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 220 రూపాయలు తగ్గి.. రూ.62,060ల దగ్గర ఉంది. Also Read : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే.. ఇక వెండి ధరలు కూడా ఈరోజు దిగివచ్చాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 100 రూపాయలు తగ్గింది. రూ.77,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ లోనూ వెండి రేటు కేజీకి 100 తగ్గి రూ.75,700ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు(Today Gold Rates) స్వల్పంగా పెరిగాయి. గత వారంలో ఔన్స్ బంగారం 2050డాలర్లకు చేరుకొని టెన్షన్ పెట్టిన బంగారం మెల్లగా తగ్గుతూ వచ్చింది. కానీ, ఈరోజు ఔన్స్ బంగారం క్రితం రేటు కంటే 14 డాలర్లు పెరిగి, 1994డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 23.03 డాలర్లుగా ఉంది. గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this interesting Video : #hyderabad #gold-and-silver-latest-prices #today-gold-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి