Gold Rates Hike: తగ్గడం తాత్కాలికమే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంత ఉందంటే.. 

తగ్గినట్టే తగ్గి మళ్ళీ బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,930ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.87,500 వద్ద ఉంది.

New Update
Gold Rates Hike: తగ్గడం తాత్కాలికమే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంత ఉందంటే.. 

Gold Rates Today: ఇటీవల కాలంలో తగ్గుదల బాటలో కనిపించి ఆశలు రేపిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకిచ్చేలా మళ్ళీ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. బంగారం కొనుక్కోవాలని ఆశపడుతున్న వారు గత వారం క్రితం వరకూ ప్రతిరోజూ పెరుగుతున్న ధరలతో టెన్షన్ పడుతూ వచ్చారు. అయితే, గత వారంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా కనిపించాయి. కానీ, మళ్ళీ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ కు షాక్ తగిలినట్టయింది. మరోవైపు బంగారం ధరల(Gold Rates Hike)పరిస్థితి ఇలా ఉంటే, వెండి మాత్రం కాస్త తగ్గి ఊరట కలిగించింది. 

సాధారణంగా బంగారం ధరలు  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, వారం క్రితం బంగారం ధరలు కాస్త తగ్గినట్టు కనిపించి ఊపిరి పీల్చుకున్న గోల్డ్ లవర్స్ కి షాకిస్తూ మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరల  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని భావిస్తున్నారు.  

ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 28న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  పెరుగుదల నమోదు చేసింది.   దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు అంతర్జాతీయంగా తగ్గాయి.  దీంతో దేశీయంగా కూడా కాస్త తగ్గుదల కనబరిచాయి.  ఈరోజు అంటే ఆదివారం (ఏప్రిల్ 28) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో కాస్త తగ్గుతున్నట్టు కనిపించిన  బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike)  200 రూపాయలు పెరిగి  రూ.66,850ల వద్దకు చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు0220 రూపాయలు పెరుగుదల  నమోదు చేసి రూ.72,930లకు ఎగసింది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకెగశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 200 రూపాయలు పెరిగి రూ.67,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 220 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.73,080ల వద్దకు చేరుకుంది. 

Also Read :  స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు!

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల (Gold Rate Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది వెండి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 500 రూపాయల తగ్గుదలతో రూ.84,000ల వద్దకు దిగివచ్చింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 7 డాలర్ల వరకూ పెరిగింది. దీంతో  2,337.93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.18డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు