Gold Rates Hike: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ బంగారం ధరలు షాకిచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,050ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,150ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,500 వద్ద ఉంది. By KVD Varma 16 Apr 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి మొన్న కొద్దిగా తగ్గి.. నిన్న స్థిరంగా ఉంది గోల్డ్ లవర్స్ లో ఆశలు రేపిన బంగారం ధరలు(Gold Rates Hike) మళ్ళీ పెరిగాయి. బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకిచ్చేలా మళ్ళీ బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం కొనుక్కోవాలని ఆశపడుతున్న వారు ప్రతిరోజూ పెరుగుతున్న ధరలతో టెన్షన్ పడుతూ వస్తున్నారు. రెండురోజులుగా బంగారం ధరలు కిందికి దిగివస్తాయని అనిపించింది. అయితే, సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ కు షాక్ తగిలింది. మరోవైపు బంగారం ధరల(Gold Rates Hike)తో పాటు రెండు రోజులు వెండి ధరలు కూడా కాస్త ఉపశమనం ఇచ్చాయి. కానీ, మళ్ళీ బంగారంతో పాటే వెండి ధరలు కూడా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు(Gold Rates Hike) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. అయితే, రెండురోజులు బంగారం ధరలు కాస్త తగ్గినట్టు కనిపించి ఊపిరి పీల్చుకున్న గోల్డ్ లవర్స్ కి షాకిస్తూ మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరల(Gold Rates Hike) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధర(Gold Rates Hike) ల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 16న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price hike) పెరుగుదల నమోదు చేసింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా పెరిగాయి. దీంతో దేశీయంగా కూడా పైకెగశాయి. ఈరోజు అంటే మంగళవారం (ఏప్రిల్ 16) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో రెండు రోజులు కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike) 550 రూపాయలు పెరిగి రూ.67,050ల వద్దకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 600 రూపాయలు పెరుగుదల నమోదు చేసి రూ.73,150లకు ఎగసింది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rates Hike) పైకెగశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 550 రూపాయలు పెరిగి (Gold Rates Hike) రూ.67,200ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 600 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.73,300ల వద్దకు చేరుకుంది. Also Read : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు! వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. కేజీకి 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది వెండి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.89,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 500 రూపాయల పెరుగుదలతో రూ.86,000ల వద్దకు ఎగసింది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం 17 డాలర్ల వరకూ పెరిగింద. దీంతో 2382.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 28.74డాలర్లకు చేరింది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. #gold-rate #gold-rate-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి