Gold Rates Hike: ఒక్కరోజు మురిపెమే..బంగారం ధరలు మళ్ళీ పెరిగాయ్!

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో పెరిగి షాకిచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,860ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,480ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.80,300 వద్ద ఉంది.

New Update
Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు!

Gold Rates Hike: వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉండి..  నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత వారంలో వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు(Gold Rates Hike) తగ్గుదల నమోదు చేయడంతో ఊపిరి పీల్చుకున్న బంగారం ప్రియులకు ఒక్కరోజు మురిపెంగానే ఆ సంతోషం మిగిలింది. మళ్ళీ బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు షాక్ తగిలిందని చెప్పాలి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Rates Hike) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ నెలలో వరుసగా  బంగారం ధరలు పైపైకి ఎగసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి20న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rates Hike) ల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ, అంతకు ముందు సెషన్ లో భారీ పెరుగుదల నమోదు అయింది. దేశీయంగా ఆ ఎఫెక్ట్ ఈరోజు కనిపించింది. దీంతో భారత్ లో బంగారం ధరల్లో భారీ పెరుగుదల  చోటుచేసుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే బుధవారం (మార్చి20) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                             

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్నతగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike) 420 రూపాయలు పెరిగి రూ.60,860ల వద్దకు చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 460 రూపాయలు పెరిగింది. దీంతో రూ.66,330లకు ఎగసింది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) భారీగా పెరిగాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 420 రూపాయలు పెరిగింది. దీంతో (Gold Rates Hike) రూ.60,950ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ కూడా 460 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.66,480లకు ఎగబాకింది.   

Also Read :  గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rates Drop) పెరుగుదల కనిపిస్తుంటే, వెండి కూడా అదే బాటలోనే ఉంది. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు పెరిగి రూ.80,300ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 300 రూపాయలు పెరిగింది. దీంతో  రూ. 77,300ల వద్దకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 10 డాలర్లు పెరిగింది. దీంతో  2160 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 25.08 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు