Gold Rates:ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు దాదాపు 5 రోజుల తర్వాత పసిడి ప్రియులకు ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ పోతూ వామ్మో అనిపిస్తున్న బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగానే కాదు దేశీయంగా కూడా బంగారం ధర పడిపోయింది. భారత్‌లో గోల్డ్ తులానికి 250 రూ. తగ్గింది. By Manogna alamuru 04 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Gold Rates:బంగారమా...అమ్మో అనే పరిస్థితి కొన్ని రోజులుగా. ఆడవారు కాదు కదా..వ్యాపారులు కూడా మార్కెట్ మొహం చూడ్డానికి భయపడ్డారు. దాదాపు వారం రోజుల పాటూ బంగారం రేటు కొండెక్కి కూర్చుంది. అది ఇవాళ మొత్తానికి దిగొచ్చింది. కొత్త సంవత్సరంలో మొదటిసారి గోల్డ్ రేటు పడిపోయింది. గత డిసెంబర్ నెలలో ఊహించని రీతిలో పెరిగిన పసిడి ధర..ఆల్ టైమ్ హై లెవెల్స్‌కు కూడా చేరింది. డిసెంబర్ 28 నుంచి ఈ ధర పెరుగుతూనే ఉంది. దీంతో ఇక మీదట బంగారం కొనలేము ఏమో అని అందరిలో ఆందోళన నెలకొంది. కానీ ఈరోజు బంగారం ధర భారీగా తగ్గి కాస్త ఓదార్పును ఇచ్చింది. Also Read:ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు దేశీయ మార్కెట్‌లో బంగారం ధర 22 క్యారెట్లు తులానికి 250 రూ. తగ్గి...ప్రస్తుతం 58, 500 దగ్గర ట్రేడవుతోంది. కానీ 24 క్యారెట్ల పసిడి రేటు మాత్రం తగ్గలేదు. అది 270 రూ. పెరిగి 63,820 దగ్గర ఉంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 47,860 వద్ద కొనసాగుతోంది. దిల్లీలో కూడా ఇదే బాటలో బంగారం రేటు పడిపోయింది. 22 క్యారెట్స్‌పై 10 గ్రాములపై రూ. 250 తగ్గి ప్రస్తుతం రూ. 58,650 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.63,970 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారంతో పాటూ వెండి ధరలు కూడా పడిపోయాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 300 రూ. తగ్గి 80 వేలకు చేరుకుంది. అదే ఢిల్లీలో అయితే కిలో వెండి ధర 300 రూ. పడిపోయి 78,600 మార్కు వద్ద ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలకు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2045 డాలర్లకు వచ్చింది. ఇది కిందటి రోజు 2060 డాలర్లపైన ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా భారీగా తగ్గింది. దీని ధర ప్రస్తుతం 22.95 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 83.330 వద్ద ఉంది. #gold #india #rates #silver #falls-down మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి