Gold Rate Today: అదే తీరు..అదే జోరు..ఆగని బంగారం పరుగు.. ఈరోజు ఎంతంటే.. బంగారం ధరల పరుగు కొనసాగుతూనే ఉంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,110ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది. By KVD Varma 11 Apr 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి బంగారం ధరలు పరుగుల జోరు కొనసాగిస్తున్నాయి. బంగారం కొనాలి అనుకునే వారికి కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకుండా.. ధరల పెరుగుదల వరుసగా కొనసాగుతూనే ఉంది. కొంత కాలంగా ప్రతిరోజూ ఎంతో కొంత పెరుగుదల నమోదు చేస్తూనే ఉంది బంగారం(Gold Rate Today). బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుదలలో పోటీపడుతున్నాయి. వరుసగా పెరుగుదల కనబరుస్తూ వస్తున్నాయి. ఎప్పుడైనా మధ్యలో కాస్త స్థిరంగా కనిపించినా.. మరుసటి రోజు భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. నిన్న నిలకడగా ఉన్న వెండి ఈరోజు ఏకంగా వెయ్యి రూపాయాల పెరుగుదల నమోదు చేసింది. సాధారణంగా బంగారం ధరలు(Gold Rate Today) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. ఈరోజు కూడా బంగారం ధరల పెరుగుదల ఆగలేదు. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో తగ్గుదల ఉండొచ్చనే సంకేతాలు, రాబోయే రెండు మూడు నెలల్లో కొన్ని దేశాల్లో సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉండడం బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 11న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Hike) కాస్త తగ్గుదల నమోదు చేసింది. అయినప్పటికీ మన దేశంలో మాత్రం బంగారం ధరల పెరుగుదల ఆగలేదు. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా తగ్గుదల నమోదు చేసినా.. దేశీయంగా మాత్రం పెరిగాయి. ఈరోజు అంటే గురువారం (ఏప్రిల్ 11) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో నిన్నపెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 350 రూపాయలు పెరిగి రూ.66,100ల వద్దఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 380 రూపాయలు పెరిగి రూ.72,110ల వద్దకు చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 350 రూపాయలు పెరిగి (Gold Rates Hike) రూ.66,250ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 380 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.72,260ల వద్ద నిలిచింది. Also Read : బంగారం ధర తగ్గుతుందనే ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈరోజు ఎంత ఉందంటే.. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. నిన్న కాస్త నిలకడగా ఉన్న వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. కేజీకి 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది వెండి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.89,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 1000 రూపాయల పెరుగుదలతో రూ.85,500ల వద్దకు ఎగసింది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం 10డాలర్లు వరకూ తగ్గింది. దీంతో 2340.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.95డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. #gold-rate #gold-rate-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి