Gold Rate News: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

మూడురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్ద ఉన్నాయి.  ఇక వెండి ధర కేజీకి రూ.200లు పెరిగి రూ.77,200 వద్ద ఉంది.

New Update
Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!

Gold Rate News: బంగారం.. కొద్దీ రోజులుగా తగ్గుతూ ఊరట నిచ్చినట్టే ఇచ్చిన బంగారం మళ్ళీ పెరిగింది.  బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారిలో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. మూడు రోజులుగా తగ్గుదల బాటలోనే ఉన్న బంగారం ధరలు ఈరోజు అంటే జనవరి 20న పెరుగుదల కనబరిచాయి.  బంగారం ధరల(Gold Rate News)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 20న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు(Today Gold Price) పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు అంటే శనివారం (జనవరి 20) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.         

హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Today Gold Price) 300 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.57,700ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 330 రూపాయలు పెరిగి  రూ. 62,950ల కు చేరుకుంది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate News) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Today Gold Price) 300 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,850ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 330రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,100ల వద్దకు చేరుకుంది. 

Also Read: భలే ఛాన్స్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా:
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate News) పెరుగుదల నమోదు చేస్తుంటే అదే బాటలో  వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి 200 రూపాయలు పెరిగి  రూ.77,200ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 200 రూపాయలు పెరిగింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,700 లకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు (Gold Rate News)పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price)  2029.63డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.61 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting News:

Advertisment
Advertisment
తాజా కథనాలు