Gold Price Today: గోల్డ్ లవర్స్ కి ఊరట.. బంగారం ధరలు తగ్గాయి.. ఎంతంటే.. 

ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది.

New Update
Gold Price Today: గోల్డ్ లవర్స్ కి ఊరట.. బంగారం ధరలు తగ్గాయి.. ఎంతంటే.. 

బంగారం ధరలు(Gold Price Today) క్రమేపీ దిగివస్తున్నాయి. మొన్న తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు.. నిన్న కాస్త పెరిగినట్టు కనిపించాయి. కానీ, ఈరోజు మళ్ళీ తగ్గాయి. అస్థిరంగా ధరలు కదులుతున్నప్పటికీ.. బంగారం ధరలు ఇటీవల కాలంలో రివ్వున ఎగసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గుదల కనిపించని బంగారం ధరల్లో ఈ వారంలో దాదాపుగా తగ్గుదలే ఎక్కువ కనిపించడం గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇది బంగారం ధరల తగ్గుదల మొదలవుతుంది అనేదానికి సూచనగా భావించవచ్చు.  పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరల్లో డిమాండ్ తగ్గడం బంగారం ధరల తగ్గుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు.   బంగారం ధరల(Gold Price Today)పరిస్థితి ఇలా ఉంటే,  మరోవైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 

సాధారణంగా బంగారం ధరలు(Gold Price Today)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వస్తోంది. బంగారం ధరల(Gold Price Today)  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. 

ఇక ఈరోజు అంటే మే 4న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  కాస్త తగ్గుదల  నమోదు చేసింది.   దీంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది.  బంగారం ధరలు(Gold Price Today) తగ్గాయి.  మరోవైపు వెండి ధరలు కూడా  అంతర్జాతీయంగా కాస్త తగ్గాయి.   అయితే దేశీయంగా మాత్రం మార్పులు లేకుండా ఉన్నాయి.  ఈరోజు అంటే బుధవారం (మే 4) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate)  500 రూపాయలు తగ్గి రూ.65,750ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 540 రూపాయలు తగ్గింది దీంతో  రూ.71,730లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) కాస్త తగ్గాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 500 రూపాయలు తగ్గి రూ.65,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 540 రూపాయలు తగ్గి రూ.71,800ల వద్దకు చేరింది. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Price Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. కానీ, ఈరోజు వెండి ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.  దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి  రూ.83,500ల వద్ద స్థిరంగా నిలిచింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త తగ్గుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,302.57డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 26.56డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు