Gold Price Policy: ఇప్పుడు దేశం మొత్తం బంగారానికి ఒకే ధర, 'వన్ నేషన్, వన్ రేట్' విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది! ఇకపై వన్ నేషన్ వన్ రేట్ పాలసీ ప్రకారం, జాతీయంగా స్థాపించే బులియన్ ఎక్స్ఛేంజ్ మాత్రమే బంగారం ధరను నిర్ణయిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్న విధానం మారితే, దేశవ్యాప్తంగా ఓకే రకమైన ధరలు ఉంటాయి. By KVD Varma 21 Jul 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Price Policy: దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలోని వివిధ పన్నులే కాకుండా బంగారం, వెండి ధరలకు అనేక ఇతర అంశాలు కూడా బంగారం ధరలలో మార్పునకు కారణంగా చెప్పవచ్చు. దీంతో రాష్ట్రాల మధ్య బంగారం ధరల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పుడు దేశంలో పెను మార్పు రాబోతోంది. వన్ నేషన్, వన్ రేట్ విధానాన్ని అమలు చేసేందుకు జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ సిద్ధమైంది. అంటే, ఈ నిర్ణయం అమలులోకి వస్తే Gold Price Policy: దేశంలో ఎక్కడైనా బంగారాన్ని కొనుగోలు చేసినా అదే రేటుకు లభిస్తాయి. ఇదే జరిగితే సామాన్యులకు తమ నగరంలోనే అదే ధరకే బంగారం లభిస్తుంది. నిజానికి, దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే రేటును అనుసరించే ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు స్వర్ణకారులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్‌లోనే దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ పాలసీ అంటే ఏమిటి? Gold Price Policy: 'వన్ నేషన్ వన్ పాలసీ' అనేది భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక. దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకే విధంగా ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకాన్ని అమలు చేయడానికి, ప్రభుత్వం జాతీయ లేబుల్ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేస్తుంది. నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ దేశవ్యాప్తంగా బంగారం ధరను నిర్ణయిస్తుంది. దీనిని మీరు ఈ విధంగా సులభమైన భాషలో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్‌లో, కంపెనీ షేర్ల ధర దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అదే ధర బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవుతుంది. ప్రస్తుతం, బంగారం -వెండి MCXలో వర్తకం అవుతుంది. అయితే ఇప్పుడు బులియన్ మార్కెట్‌కు కూడా ఎక్స్చేంజ్ రానుంది. ఈ ఎక్స్చేంజ్ తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ విధంగా ప్రయోజనం.. Gold Price Policy: జాతీయంగా ఏర్పాటు అయ్యే బులియన్ ఎక్స్ఛేంజ్ బంగారం ధరను నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులు బంగారాన్ని ఎక్స్ఛేంజ్ నిర్ణయించిన ధరకే విక్రయించాలి. ఇదే జరిగితే పరిశ్రమలో పారదర్శకత పెరగడం ఖాయం. దీనితో పాటు, దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు కూడా అదే ధరకు బంగారం పొందుతారు. మీరు విశాఖపట్నంలో నివసిస్తున్నారని అనుకుందాం, అక్కడ బంగారం ఖరీదైనది. అలాంటి సందర్భంలో, మీ ఇంట్లో పెళ్లి జరిగితే, మీరు బంగారం కొనడానికి తక్కువ ధరకు దొరికే హైదరాబాద్ వెళతారు. ఈ పథకం అమలు తర్వాత, ఇలా అక్కడికీ ఇక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. ధర ఎలా నిర్ణయిస్తారు? Gold Price Policy: ప్రస్తుతం బంగారం ధరలను బులియన్ మార్కెట్ అసోసియేషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ప్రతి నగరానికి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి బులియన్ మార్కెట్ సాయంత్రం తమ తమ నగరాలకు ధరలను విడుదల చేస్తుంది. పెట్రోల్-డీజిల్ లాగానే బంగారం-వెండి ధరలు కూడా ప్రతిరోజూ నిర్ణయిస్తారు. బంగారం - వెండి ధరలలో గ్లోబల్ సెంటిమెంట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు కూడా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. గోల్డ్ ఎక్స్చేంజ్ వస్తే ఈ పధ్ధతి మారుతుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒకేవిధంగా ఉంటాయి. ధరలు తగ్గుతాయా? ఈ విధానం రావడం వల్ల పరిశ్రమల్లో పారదర్శకత పెరుగుతుందని, సామాన్యులకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ధర అంతరం ముగుస్తున్న కొద్దీ బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు ఆభరణాల వ్యాపారుల ఇష్టారాజ్యాన్ని నియంత్రించనున్నారు. దీనితో పాటు, ఈ పథకం ప్రారంభం వ్యాపారవేత్తల మధ్య పోటీని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ పథకం వాణిజ్య కోణం నుండి కూడా ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి, స్వర్ణకారుల సంస్థ GJC దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారుల నుండి అభిప్రాయాలను కోరింది. దీన్ని అమలు చేసేందుకు స్వర్ణకారులు అంగీకరించారు. #gold-price #gold-exchange మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి