Gold Price Hike: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధర!

బంగారం - వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 89,500 గా ఉంది. 

New Update
Gold Price Hike: గోల్డ్ లవర్స్ కి గుడ్  న్యూస్..  మళ్ళీ తగ్గిన బంగారం ధర!

Gold Price Today:  ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మొన్న ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పది గ్రాములకు 550 రూపాయల వరకూ పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కరెక్షన్ కనబరిచినట్లు భావించవచ్చు. అయితే ,  ఈరోజు మళ్ళీ బంగారం ధరలు భారీగా తగ్గాయి .  అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడమే దానికి కారణం .  మరోవైపు వెండి ధరలు కూడా భారీగా  తగ్గాయి. కేజీకి 2 వేల 500 రూపాయలు తగ్గింది వెండి.  మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 8న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గి  గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుదలతో  ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త తగ్గుదల నమోదు చేయవచ్చు. లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉందని  నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 400 రూపాయలు తగ్గింది.  అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 440 రూపాయలు తగ్గింది.  ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 రూపాయలు తగ్గింది.  మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీ తగ్గుదల  నమోదు చేశాయి. కేజీకి 2 వేల 500  రూపాయలు వెండి ధరలు తగ్గాయి .  

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,800

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,870

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల   కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,800

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,870

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,950

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,020

Gold Price Today: బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిస్తే, మరోవైపు వెండి ధరలు కూడా ఒక్కసారిగా తగ్గాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 92,000 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 87,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల  కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,497డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు ఒక్కసారే తగ్గాయి. దీంతో కేజీకి 898 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు