Gold Price Drop: గోల్డ్ లవర్స్ కు భలే ఛాన్స్.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,180ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.1500 తగ్గి రూ.75,500 వద్ద ఉంది.

New Update
Gold Price Drop: గోల్డ్ లవర్స్ కు భలే ఛాన్స్.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే..

Gold Price Drop: పసిడి ప్రియులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వరుసగా 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పది గ్రాముల బంగారం ఇటీవల కాలంలో 1000 రూపాయలకు పైగా తగ్గిపోయింది. ఈరోజు ఒక్కరోజే భారీగా బంగారం ధర పడిపోయింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతుండడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు.  బంగారం, వెండి ధరలు(Gold Rates) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ పసిడి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Price Drop) ఇటీవలి కాలంలో ఇంత తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గుదల కనబరిచాయి.  ఈరోజు అంటే గురువారం (ఫిబ్రవరి 15) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.         

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో  బంగారం ధరలు భారీగా (Gold Price Drop) తగ్గాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price Drop) ఏకంగా 600 రూపాయలు తగ్గి రూ.57,000ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 660 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,180లకు దిగివచ్చింది.  

ఢిల్లీ లో ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price Drop) 10 గ్రాములకు 600 రూపాయలు తగ్గి రూ.57,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 680 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.66,310ల వద్ద కు చేరింది. 

Also Read: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Drop) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి  ఏకంగా 1500 రూపాయలు తగ్గింది. దీంతో  రూ.75,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 1500 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 74,000లకు దిగివచ్చింది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం భారీగా తగ్గి (Gold Price Today)  1990 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.38డాలర్లకు దిగి వచ్చింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు