వారం ప్రారంభంలోనే పెరిగిన బంగారం,వెండి ధరలు!

దేశవ్యాప్తంగా నేడు 22 క్యారెట్ల ఆభరణాల ధర గ్రాముకు రూ.20 పెరిగి రూ.6,470కి చేరింది.అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16 పెరిగి రూ.5,300కి  చేరుకుంది.వెండి ధర కూడా గ్రాముకు రూ.1 పెరిగి కిలో రూ.91,000కి చేరింది.

New Update
వారం ప్రారంభంలోనే పెరిగిన బంగారం,వెండి ధరలు!

ఆగస్టు ప్రారంభం నుంచి బంగారం ధరలు అస్థిరతను చవిచూస్తున్నాయి.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి..

ఈ సందర్భంలో, బంగారం ధర  ఆగస్టు 3న గ్రాము రూ.10 నుంచి రూ.80కి భారీగా తగ్గింది.దీని ప్రకారం ఈరోజు ఆగస్టు 5న 22 క్యారెట్ల ఆభరణాల ధర గ్రాముకు రూ.20 పెరిగి రూ.6,470కి చేరింది.అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము ధర రూ.16 పెరిగి రూ.5,300కి  చేరుకుంది.వెండి ధర కూడా గ్రాముకు రూ.1 పెరిగి రూ.91.00, కిలో రూ.91,000కి చేరింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు