Gold and Silver Price: బంగారం ధరల మోత..వెండి ధరల బాదుడు..ఈరోజు ఎంత పెరిగాయంటే.. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,380ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,500 వద్ద ఉంది. By KVD Varma 08 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి బంగారం ధరల (Gold and Silver Price)పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండోరోజూ బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అక్షయ తృతీయ పండుగ కోసం బంగారం కొనాలని అనుకునే వారికి బంగారం ధరల పెరుగుదల నిరాశను మిగులుస్తోంది. సోమా, మంగళవారాల్లో అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. అయితే, ఈరోజు బంగారం ధరలు అంతర్జాతీయంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయితే, ఈ తగ్గుదల భారీగా ఉండకపోవచ్చు. అంతకు ముందు రోజు కూడా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు(Gold and Silver Price) మళ్ళీ పెరుగుదల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు(Gold and Silver Price) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. మొన్నటి నిలకడగా నిలిచి ఆశలు రేపిన బంగారం ధరలు.. నిన్న పెరుగుదల బాటలోకి వెళ్లి నిరాశ నింపాయి. నిన్నటి బాటలోనే ఈరోజు కూడా బంగారం ధరలు మళ్ళీ ఈరోజు పైకెగశాయి. బంగారం ధరల(Gold and Silver Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధర ల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. ఇక ఈరోజు అంటే మే 8న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర భారీగా తగ్గింది. ఆ ప్రభావం దేశీయంగా బంగారం ధరల(Gold and Silver Price)పై పెద్దగా కనిపించలేదు. దేశీయంగా వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా కాస్త పెరిగాయి. దేశీయంగా ఆ ప్రభావం బాగానే కనిపించింది. వెండి ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే బుధవారం (మే8) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold and Silver Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల(Gold and Silver Price) నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate) 300 రూపాయలు పెరిగి రూ.66,350ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 330 రూపాయలు పెరిగి రూ.72,380లుగా ఉంది. Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా? ఢిల్లీలో బంగారం ధరలు ఇలా.. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold and Silver Price) పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 300 రూపాయలు పెరిగి రూ.66,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 330 రూపాయలు పెరిగింది. దీంతో రూ.72,530లకు చేరుకుంది. వెండి ధరలు ఇలా.. ఇక వెండి విషయానికి వస్తే.. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగితే.. అదే బాటలో వెండి ధరలు(Gold and Silver Price) కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండిధర 1000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.88,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.85,000ల వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఈరోజు కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈరోజు ఉదయం 8గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,310.80డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసి ఔన్స్ 27.19డాలర్లకు చేరింది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. #gold-rate #gold-rate-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి