Supreme Court : జ్ఞానవాపి మసీదులో పూజలు.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జ్ఞానవాపి మసీదులో హిందులు పూజలు నిలిపివేయాలంటూ జ్ఞాన్‌వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. పూజలు చేసేందుకు అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కమిటీ సవాలు చేసింది. By Manogna alamuru 01 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Gyanvapi Masjid : ఫిబ్రవరి 26వ తేదీన జ్ఞానవాపి లో హిందవులు(Hindus) పూజలు చేసుకోవచ్చునంటూ అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం పూజలు(Pooja) నిర్వహించింది. అప్పటి నుంచి కాశీ విశ్వనాథ ట్రస్ట్(Kasi Viswanath Trust) అక్కడ పూజలు చేస్తోంది. హిందువులు రోజూ నేలమాళిగలో ఉన్న ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అప్పుడే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం గుడి, పూజలు అంటున్నారని పిటిషన్‌లో పేర్కొంది. బాబ్రీ మసీదు విషయంలో అనుసరించిన విధానాలనే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారని చెబుతున్నారు మసీదు కమిటీ తరుఫు న్యాయవాది మొరాజుద్ధీన్ సిద్ధిఖీ. అంతకు ముందు జ్ఞానవాపి అంజుమన్ మసీదు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది. దానిని హైకోర్టు తిరస్కరిస్తూ... పూజలు చేయడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పునే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ మసీదు కమిటీ. దీని మీద సుప్రీంకోర్టులో ఇవాళ ప్రధాన న్యాయమూర్తి డీవై యంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. నేలమాళిగలో ఎప్పుడూ విగ్రహం లేదని ముస్లిం పక్షం వాదిస్తోంది. అయితే త్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(Archaeological Survey of India) నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆ ప్రాంతంలో మసీదు నిర్మించడానికి ముందు ఓ పెద్ద హిందూ దేవాలయం(Hindu Temple) ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొన్నదని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్(Vishnu Shankar Jain) తెలిపారు. ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని నివేదిక సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణానికి ఎలాంటి నష్టమూ జరగకుండా మసీదులో గుర్తించిన వస్తువులన్నిటినీ డాక్యుమెంట్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు జ్ఞనవాపి మసీదు(Gyanvapi Mosque) నాలుగు బేస్‌మెంట్‌లోని ఒక దానిలో పూజారుల కుటుంబం ఎప్పటి నుంచో నివాసం ఉంటోంది. 1993లో సీలు వేయడానికి ముందు నుంచి సోమనాథ్ వ్యాస్ అనే పూజారుల కుటుంబం నేలమాళిగలో నివసిస్తున్నారు. 1991 డిఆసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత 1993లో జ్ఞానవాపిలోని హిందూ దేవతలు ఉన్న ప్రాంతాన్ని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయమ్ సింగ్ (Mulayam Singh) ఆదేశాలతో సీల్ చేశారు. Also Read : Delhi : నేడు కవిత బెయిల్ మీద విచారణ #supreme-court #mosque #gyanvapi-masjid-case-latest-news #petiiton మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి