Thandel Glimpse video: పాకిస్తాన్ అడ్డాలో భరతమాత బిడ్డ విశ్వరూపం... దుమ్మురేపుతోన్న నాగచైతన్య తండేల్ గ్లింప్స్ చైతూ,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ 'తండేల్.మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చైతూకి ఈ మూవీ ఖచ్చితంగా సక్సస్ అందిస్తుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. By Nedunuri Srinivas 06 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Thandel Glimpse video: అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో కార్తీకేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం తండేల్. ఈ మూవీలో చైతూ మత్స్యకారుడిగా ఊర మాస్ లుక్ లో దర్శనమిస్తున్నారు. జనవరి 6 న రిలీజయిన ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజయి ఆకట్టుకుంటోంది. సముద్రం లో చేపల వేటకు వెళ్లిన చైతూ పాకిస్తాన్ కరాచీ జైలు లో బందీ అయినట్లు వీడియోలో చూపించారు. "ఈపాలి యేట... గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే" "ఈపాలి యేట... గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే" అంటూ సముద్రంలో వల విసురుతూ నాగచైతన్య చెప్పే డైలాగ్ తో జోష్ గా ఆరంభమయిన గ్లింప్స్ .. చివరికి వచ్చేసరికి సీరియస్ మోడ్ లోకి లాక్కెళ్లారు. సముద్ర జలాల్లో వేటకెళ్లే మత్స్యకారులను పాకిస్థాన్ సైన్యం పట్టుకుని వారిని ఏళ్ల తరబడి జైళ్లలోనే బంధించడం చాలా మత్సకారుల కుటుంబాలలో జరిగిన ఘటనలే.శ్రీకాకుళం జిల్లా వాసుల నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనల స్పూర్తితో 'తండేల్' చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం రియల్ గా సఫర్ అయిన బాధితుల కుటుంబాల దగ్గరకు వెళ్లి వారి గ్రామాల్లో తిరిగి చాలా రీసెర్చ్ చేశారు చిత్ర దర్సకుడు చందు ,చైతు.తండేల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరెకెక్కుతోన్న తండేల్ యదార్ధ సంఘటనల ఆధారంగా తీస్తునందువల్లే చైతు చెప్పిన ప్రతీ డైలాగ్ చాలా హై ఇంటెన్షన్ తో ఉంది. పాకిస్తాన్ జైల్లో చైతూని చిత్ర హింసలు పెడుతున్నా సరే మన దేశ గొప్పతనం గురించి చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేవిధంగా ఉన్నాయి. జైల్లో కిందపడిన భారత త్రివర్ణ పతాకాన్ని చైతూ తీసుకోబోగా, పాక్ పోలీస్ అధికారి ఒకరు "దేశభక్తా?" అంటూ ప్రశ్నించగా... "మా నుంచి ఊడిపోయిన ఒక ముక్క (పాకిస్థాన్)... మీకే అంత ఉంటే... ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత ఉండాలి... భారత్ మాతా కీ జై" అంటూ చైతూ చాలా పవర్ ఫుల్ గా చేప్పడం ఈ గ్లింప్స్ లో హైలెట్. ఇక..సాయి పల్లవి విషయానికి వస్తే .. చైతూ కోసం సముద్రపు ఒడ్డున ఎదురుచూస్తున్న విజువల్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. బుజ్జితల్లి వచ్చేత్నా కదే అంటూ చైతూ చెప్పే డైలాగ్ దానికి డిఎస్పీ ఇచ్చిన నేపధ్యసంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. నిజంగా తండేల్ సినిమా చైతూ చూపినట్లు "ఈపాలి యేట... గురి తప్పేదేలేదేస్..అనే రేంజ్ లోనే ఉంది. ALSO READ:Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్ #sai-pallavi #allu-aravind #thandel #naga-chaitanya #thandel-glimpse-video #chandhu-mondeti #geetha-arts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి