Hyderabad: ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక సూసైడ్

హైదరాబాద్‌లోని చందనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. 6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్‌లో చదువుతుంది.

New Update
Hyderabad: ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక సూసైడ్

హైదరాబాద్‌లోని చందనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. 6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్‌లో చదువుతుంది. పాఠశాల అనంతరం బాలిక ఇంటికి వచ్చింది . బాలికను మ్యాథ్స్‌ ట్యూషన్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బాలిక తాను వెళ్లను అని తెగేసి చెప్పింది. దీంతో బాలికపై తల్లి ఒత్తిడి తీసుకురావడంతో బాలిక 15వ అంతాస్థులోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

తమ కూతురు రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతిపై ఆరా తీశారు. మృతురాలి తండ్రి సందీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బాలికను అదే కమ్యూనిటీలోని 15 అంతస్థులో మ్యాథ్స్ టూషన్‌లో జాయిన్‌ చేశారు. కాగా బాలిక గత కొన్ని రోజుల నుంచి ట్యూషన్‌కు వెళ్లనని మారం చేస్తున్నట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావద్దని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారులు ఏమీ ఆలోచించకుండా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు