Recruitment news: రూ.2,18,200 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. డిటైల్స్ చెక్ చేసుకోండి! 368 సైంటిస్టుల పోస్టుల ఖాళీలను అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ASRB) భర్తీ చేస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. ఎంపికైన వారికి నెలకు రూ. 1,44200 నుంచి రూ. 2,18,200 పే లభిస్తుంది. https://www.asrb.org.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. By Trinath 26 Aug 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ASRB Recruitment 2023: అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో 368 ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఇతరుల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థలో జాబ్ తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం సెప్టెంబర్ 8లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ASRB రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ప్రాసెస్, అర్హత, వయోపరిమితి, ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి. ➼ ముఖ్యమైన తేదీలు: • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 18, 2023 • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2023 • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2023 ➼ ఖాళీ వివరాలు: ICAR రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్‌తో కలిపి మొత్తం 368 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ➼ వయో పరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ(సెప్టెంబర్ 8) నాటికి అభ్యర్థులు 52 సంవత్సరాల వయస్సును మించి ఉండకూడదు. సీనియర్ సైంటిస్ట్ పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ముగింపు తేదీ నాటికి అభ్యర్థులు 47 ఏళ్ల వయస్సు నిండి ఉండకూడదు. ➼ దరఖాస్తు రుసుము: జనరల్ క్యాటగిరి: రూ. 1500/- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ➼ విద్యార్హతలు: • సీనియర్ సైంటిస్ట్ (ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్): అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్ / అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో Ph.D కలిగి ఉండాలి లేదా IIMలు అందించే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (FPM) లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రి-లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా తత్సమానం ఉండాలి. • సీనియర్ సైంటిస్ట్ (సైన్స్ కమ్యూనికేషన్): అభ్యర్థులు సైన్స్/ఇంజనీరింగ్‌లో ప్రాథమిక డిగ్రీతో పాటు సైన్స్/కమ్యూనికేషన్/సైన్స్ కమ్యూనికేషన్/మాస్ కమ్యూనికేషన్/మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో ఏదైనా బ్రాంచ్‌లో Ph.D కలిగి ఉండాలి. ➼ ఎలా దరఖాస్తు చేయాలి? ➊ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి https://www.asrb.org.in/ . ➋ దరఖాస్తు చేయడానికి ముందు ఈ నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదవాలిజ ➌ నిర్దేశించిన వయో పరిమితులు, విద్యార్హతలు మొదలైన వాటితో సహా అన్ని ఆధారాలను పూర్తి చేయండి. ➍ అభ్యర్థులు పార్ట్-1లో ఫిల్ చేసిన తర్వాత ఈమెయిల్/SMS వస్తుంది. పేరు, తండ్రి పేరు, ఈ-మెయిల్ ఐడి, పుట్టిన తేదీ మొదలైన వాటికి సంబంధించిన ప్రాథమిక డేటా పెట్టాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ అన్ని దశలు పూర్తి చేయాలి. ➎ అభ్యర్థి వ్యక్తిగత వివరాలను పూరించాలి. ➏ విద్యా, వృత్తిపరమైన అర్హతలు అనే కాలమ్‌ని ఫిల్ చేయండి. ➐ భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి. ➼ శాలరీ: • ప్రధాన సైంటిస్టు: పే స్కెల్-14 (రూ. 1,44200 – రూ. 2,18,200/-) • సీనియర్ సైంటిస్టు: పే స్కెల్-13 (రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100/-) For complete Notification Details click here #jobs #central-government-jobs #asrb-recruitment-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి