DSP : బదిలీల పర్వం.. ఈసారి డీఎస్పీల వంతు.. మొత్తం ఎంత మందంటే?

ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేశారు.

New Update
DSP : బదిలీల పర్వం.. ఈసారి డీఎస్పీల వంతు.. మొత్తం ఎంత మందంటే?

DSP Transfers in Telangana : తెలంగాణ(Telangana) లో పనిచేస్తున్న 47 మంది డిఎస్పీ(DSP) లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త(DGP Ravi Gupta) ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఈ విధంగా ఆదేశాలు జారీ చేయగా డీజీపీ దాన్ని ఫాలో అయ్యారు. అందుకే పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది.

CLICK HERE FOR DSP TRANSFERS LIST
ఇక మూడు రోజుల క్రితం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.

* మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌.
* హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా అకాంక్ష్ యాదవ్‌.
* మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్‌.
* ప్రస్తుత మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఇక గత ఫిబ్రవరి 26న మరో ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లను బదిలీ చేసింది సర్కార్. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : స్పెయిన్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా స్వీకరించిన జార్ఖండ్‌ హైకోర్టు!

Advertisment
Advertisment
తాజా కథనాలు