Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం

ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. చెత్త ఏరుకునే 12ఏళ్ల బాలికపై సదన్ బజార్‌లో ఓ టీ స్టాల్ యజమాని, అందులో పనిచేసే మరో ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. జనవరి 1న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం

Gang Rape : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో మరో దారుణం జరిగింది. మైనర్(Minor Girl) బాలికను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్(Gang Rape) చేసిన సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొత్త సంవత్సరం రోజే జనవరి 1న ఈ భయంకరమైన ఘనట జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని సదన్ బజార్‌లో ఉన్న ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేశాడు. అయితే ఇందులో భాగంగానే ఒక మహిళను రాత్రికి తీసుకురావాలని అదే ప్రాంతంలో రోజు చెత్త ఏరుకునే ఒక మహిళ సాయం కోరాడు. ఈ క్రమంలో అతని దగ్గర కొంత డబ్బు తీసుకున్న ఆమె.. జనవరి 1న ఒక బాలికను (12)ను ఖుర్షీద్ మార్కెట్‌లోని భవనం పైకప్పు నుంచి చెత్త సేకరించాలని చెప్పి తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న టీ స్టాల్ ఓనర్, అందులో పనిచేసే ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించగా ఆమె భయపడిపోయింది.

ఇది కూడా చదవండి : Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!

ఇక అక్కడినుంచి తిరిగి ఇంటికి వచ్చిన బాలిక రెండు రోజులుగా డల్ గా కనిపించడంతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చింది.  బంధువులు, తల్లి దండ్రులు ఆరాతీయగా అసలు విషయం బయటపెట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలికను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. టీ షాపు యజమాని ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నివాసి కాగా, అందులో పనిచేసే ముగ్గురు అబ్బాయిలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Paster praveen: ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!

పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు.

New Update
prvn pstr

paster praveen case

Paster praveen: పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని నేతాజి నగర్ ఇంటినుంచి బయలుదేరిన ఆయన.. రాజమండ్రి చేరుకునే లోపు మూడుసార్లు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీపుటేజీ ఆధారాలు వెల్లడించారు. అంతేకాదు మూడుసార్లు యాక్సిడెంట్ జరిగిందని, తనకై తానే బైక్ అదుపుతప్పి పడిపోయినట్లు వీడియోలు బయటపెట్టారు. 

ఒక పెట్రోల్ బంకులోనూ మద్యంమత్తులో ఉన్న ప్రవీణ్ బైక్ నడపలేక తడబడుతున్నట్లు కనిపించింది. బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలోనూ బైక్ హ్యాండిల్ కు బదులు పెట్రోల్ పైపును పట్టుకున్నారు. తన వెనకాల ఉన్న లగేజ్ జారిపడిపోతున్న పెద్దగా పట్టించుకోలేదు. మరోచోట టీ తాగినపుడు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు గుర్తించి బైక్ పై వెళ్లొద్దని, కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన వినకుండా అలాగే బైక్ పై వెళ్లారు. చివరగా అర్థరాత్రి 11 తర్వాత అతి వేగంగా వెళ్తూ రోడ్డుపక్కన పడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతోపాటు అతను మద్యం సేవించి ఉండటం వల్ల త్వరగా చనిపోయినట్లు ఐజీ ఆశోక్ కుమార్ స్పష్టం చేశారు. 

Also Read: USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

ఇంటినుంచి బయలుదేరిన ప్రవీణ్ డైరెక్టుగా ఎవరినీ కలవలేదని తెలిపారు. రెండు వారాలు సమయం ఇచ్చినా ఎవరు ఆధారాలతో రాలేదన్నారు. మొత్తం 92 మందిని ఇన్విస్టిగేషన్ చేశామన్నారు. ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిందని, ఎవరు అనవసర వివాదాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవీన్ కుటుంబానికి ప్రైవసీ అవసరమని, దయచేసి ఎవరు దీనిని పక్కదారి పట్టించొద్దని కోరారు. 

 paster praveen | case | police | telugu-news 

Advertisment
Advertisment
Advertisment