Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

New Update
Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2న గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టు కాలనీకి చెందిన పకృద్దిన్‌ వృత్తి రిత్యా ఆటో డ్రైవరని అతను తన ఆటోను రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచినట్లు తెలిపారు. ఉదయం లేచి చూసే సరికి అక్కడ ఆటో లేకపోవడంతో కంగారు పడ్డ పకృద్దిన్‌ పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్పీ సృజన తెలిపారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు శుక్రవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. వారిని తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం బయటపడినట్లు పేర్కొన్నారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దుండగులను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా దుండగులు పోలీసుల ఎత్తుకు పైఎత్తు వేస్తూ సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు