Balapur Laddu Auction Record Price:బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర రూ. 27 లక్షలు

బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. మొత్తం 36మంది పాల్గొన్న ఈ వేలంలో లడ్డూను దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది.

New Update
Balapur Laddu Auction Record Price:బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర రూ. 27 లక్షలు

Balapur Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. ఈ రోజు హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూను రూ.27 లక్షలకు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి (Dasari Dayanand Reddy). దయానంద్ రెడ్డి తుర్కయాంజల్ కు చెందిన రియల్టర్. ఈ వేలం పాటలో మొత్తం 36 మంది పాల్గొన్నారు.

గతేడాది లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. లాస్ట్ టైమ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ సారి వేలం పాటలో పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూ మొదటి నుంచి చాలా ఫేమస్. ఇక్కడ లడ్డూను పాడుకోవడానికి పోటీలు పడుతుంటారు. ఈసారి కూడా వేలం మొదలైన దగ్గర నుంచి ఆసక్తి నెలకొల్పింది. మొదటి నుంచే లడ్డూ ధర అరకోటి టచ్ అవుతుందని అంచనా ఉంది. కానీ పాట 27 లక్షల దగ్గరనే ఆగిపోయింది. పాట మొదలైనప్పటి నుంచి ఆసక్తిని రేపింది. మొత్తం 36 మంది ఈ ఆక్షన్ లో పాల్గొన్నారు.

balapur laddu

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూకు వేలంలో రికార్డ్ ధర పలికింది. గణేశుడి లడ్డూను ఏకంగా కోటి 26 లక్షలకు పాడుకున్నారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తానని చెబుతున్నారు లడ్డూను దక్కించుకున్న ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. గణపతి లడ్డూ ఇంత ధర పలకడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఇక మాదాపూర్ మై హోమ్ భూజాలో కూడా గణపతి లడ్డూకు వేలంలో భారీ ధరనే సొంతం చేసుకుంది. ఇక్కడ లడ్డూ 25.50 లక్షలకు సొంతం చేసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment