Gaami X Review : మెంటల్ మాస్.. విశ్వక్ సేనుడి 'గామి' ట్విటర్ రివ్యూ ఇదే!

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్‌సేన్ 'గామి'తో ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ట్విట్టర్‌లో భిన్నరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు డిసెంట్‌ మూవీ అని చెబుతుంటే సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందని ఇంకొందరు అంటున్నారు.

New Update
Gaami X Review : మెంటల్ మాస్.. విశ్వక్ సేనుడి 'గామి' ట్విటర్ రివ్యూ ఇదే!

Gaami Twitter Review : విశ్వక్ సేన్(Vishwak Sen), చాందినీ చౌదరి(Chandini Chowdary), అభినయ(Abhinaya) నటించిన సాహస చిత్రం గామి(Gaami). ఈ మూవీ మార్చి 8న(ఇవాళ) మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా విడుదలైంది. విద్యాధర్ కగిత ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌తో విడుదలకు ముందే గ్రేట్‌ బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు విశ్వక్ సేన్ యూనిక్‌గా సినిమాల్లో నటిస్తూ తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నాడు. ఇక ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి మొదటి రోజు ఫస్ట్ షో తర్వాత ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉంది?. సినిమా చూసినవాళ్లు ఏం షేర్ చేస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

విశ్వక్ సేన్ మూవీ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌(X) లో భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందని ట్వీట్లు పెడితే.. మరికొందరు మూవీ చాలా డిసెంట్‌గా ఉందని చెబుతున్నారు. మూవీ టీమ్‌ హార్డ్‌వర్క్‌ సినిమా చూస్తుంటే క్లియర్‌కట్‌గా కనిపించిందని మెచ్చుకుంటున్నారు. ఇక మ్యూజిక్‌ అద్భుతంగా ఉందని అంటున్నారు. అయితే చాలా ట్వీట్లలో కామన్‌గా ఒక పాయింట్‌ కనిపిస్తుంది. మూవీ చాలా స్లోగా రన్‌ అవుతుందన్నది చాలా మంది పెడుతున్న ట్వీట్‌. అయితే ఇందులో లాజిక్‌ లేదని మరికొందరు అంటున్నారు. మలయళం సినిమాలు స్లోగా ఉంటే కల్ట్‌ క్లాసిక్‌ అంటారని.. అయితే తెలుగు సినిమాల్లో స్లో నెరేషన్‌ ఉంటే మాత్రం నిద్ర, స్లీపింగ్‌ ట్యాబ్లెట్‌ అని మాట్లాడుతుంటారని కౌంటర్లు వేస్తున్నారు. ఇక నెటిజన్ల ట్వీట్లను కింద చూడండి.

Also Read : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ తో రాబోతున్న కన్నప్ప టీం!

Advertisment
Advertisment
తాజా కథనాలు