G20 summit: ఆయన వస్తారనుకున్నా..కానీ..! జీ20 సమ్మిట్‌కి జిన్‌పింగ్‌ డుమ్మాపై బైడెన్‌ ఏం అన్నారంటే!

భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. బైడెన్‌ ఒక్క రోజు ముందుగానే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుండగా.. మోదీతో బైడెన్‌ ఈ నెల 8న భేటీ కానున్నారు. మరోవైపు జిన్‌పింగ్‌ డుమ్మా వెనుక అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశం ముడిపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

New Update
G20 summit: ఆయన వస్తారనుకున్నా..కానీ..! జీ20 సమ్మిట్‌కి జిన్‌పింగ్‌ డుమ్మాపై బైడెన్‌ ఏం అన్నారంటే!

G20 Summit: జీ20 సమావేశాల వేళ ప్రపంచం చూపు ఇండియావైపు పడింది. ఈ సమ్మిట్‌కి తొలి సారి భారత్‌ హోస్ట్ చేస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టనున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(biden) మాత్రం ఒక్క రోజు ముందుగానే ఇండియా గడ్డపై అడుగుపెట్టనున్నారు. ప్రధాని మోదీ(Modi)తో ఈ నెల 8న భేటీ కానున్నారు. ఈ షెడ్యూల్‌ ఇప్పటికే ఫిక్స్‌ ఐపోయింది. ఇక తాజాగా జిన్‌పింగ్‌ గైర్హాజరుపై బైడెన్‌ పెదవి విప్పారు. ఇండియాకు జిన్‌పింగ్‌ రావడంలేదన్న విషయం తెలుసుకున్న బైడెన్‌ ఈ విధంగా కామెంట్స్ చేశారు "నేను నిరుత్సాహపడ్డాను ... కానీ నేను అతనిని చూడటానికి వెళుతున్నాను" అని బైడెన్ డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో విలేకరులతో అన్నారు. "నాకు మరికొంత... సమన్వయం కావాలి. వారిద్దరూ (భారత్‌, వియత్నాం) యునైటెడ్ స్టేట్స్‌తో చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారు, అది చాలా ప్రయోజనంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని బైడెన్ చెప్పారు.

జిన్‌పింగ్ ఎందుకు రావడంలేదు:
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ బీజింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని 'రాయిటర్స్‌' ఓ కథనం ప్రచురించింది. జిన్‌పింగ్‌ ఎందుకు రావడం లేదన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ లేదు. అయితే వచ్చే వారం జకార్తాలో జరిగే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా నేషన్స్), తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలను కూడా జిన్‌పింగ్‌ వెళ్లడంలేదు. ఈ సమావేశానికి మోదీ హాజరవుతున్నారు. ఇటు శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్‌ హాజరవుతారని బైడెన్ ఆశిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి గతంలో చెప్పారు. గత వారం ప్రారంభంలో వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో సహా ఇటీవలి నెలల్లో బీజింగ్‌ను అమెరికా ప్రతినిధులు విజిట్ చేశారు. దీంతో భారత్‌ పర్యటన సందర్బంగా ఈ ఇద్దరి మధ్య భేటీ ఉండొచ్చని అంతా భావించారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది.

అరుణాచల్‌ ప్రదేశే కారణమా?
మరోవైపు జిన్‌పింగ్‌ గైర్హాజరుకు అరుణాచల్‌ప్రదేశ్‌ అంశమే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో (ఆగస్టు 22-24) బ్రిక్స్ సమావేశాల సందర్భంగా జిన్‌పింగ్‌, మోదీ మధ్య భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌తో మోదీ సూటిగా చెప్పినట్లు సమాచారం. అయితే జిన్‌పింగ్‌ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి చైనాకు వచ్చిన వెంటనే బీజింగ్ ఒక రహస్య మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో అరుణాచల్, తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా భూభాగాలుగా చూపించారు. ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ASPI)లో సౌత్ ఏషియా ఇనిషియేటివ్స్ డైరెక్టర్ ఫర్వా అమెర్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శిఖరాగ్ర సమావేశాన్ని జిన్‌పింగ్‌ దాటవేయడం వెనుక అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశం ముడిపడి ఉందన్నారు. చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనని భావిస్తుందని..అందుకే ఈ టైమ్‌లో ఇండియాలో అడుగుపెట్టకూడదని జిన్‌పింగ్‌ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ALSO READ: జీ20 సమ్మిట్ కోసం సిద్ధమైన ఢిల్లీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా..

Advertisment
Advertisment
తాజా కథనాలు