Kishan Reddy: ఆధ్మాత్మిక నగరంలో జీ20 సమావేశాలు జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. By Karthik 25 Aug 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం సమావేశాలు ముగిసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శనివారం జీ20 సభ్య దేశాలతో పాటు 8 ఆహ్వానిత దేశాలకు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రులు, 6 అంతర్జాతీయ సంస్థలకు చెందిన సభ్యుల భేటీతో సాంస్కృతిక శాఖ జీ20 సమావేశాలు పూర్తవుతాయని ఎంపీ తెలిపారు. జీ20 సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాలు చక్కటి వేదికగా నిలుస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత్‌లో కల్చరర్ వర్కింగ్ మీటింగ్ జరిందన్న ఆయన.. మే నెలలో భువనేశ్వర్ వేదికగా రెండో కల్చరల్ వర్కింగ్ మీటింగ్ జరిగిందని గుర్తు చేశారు. దీంతో పాటు మూడో సమావేశం జూలైలో కర్ణాటకలోని హంపిలో జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 4వ కల్చరల్ వర్కింగ్ మీటింగ్ వారణాసితో జరుగుతోందని వెల్లడించారు. అనంతరం వారణాసిలో కల్చరల్ మీటింగ్ ఉండబోతోందని ఎంపీ వివరించారు. రేపు ఉదయం వరకు ఈ డిక్లరేషన్ తుదిరూపు సిద్ధం కానుందని స్పష్టం చేశారు. అనంతరం జరిగే సమావేశంలో ఈ డిక్లరేషన్‌కు ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి బారత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ వెబినార్లు నిర్వహించామన్నారు. ఈ వెబినార్‌ల్లో జీ20 దేశాలతోపాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య పక్షాల నుంచి సుమారు 159 మంది పాల్గొన్నారన్నారు. ఈ వెబినార్ల ద్వారా సేకరించిన సమాచారంతోనే వారణాసి డిక్లరేషన్ ఉంటుందన్నారు. జీ20 సదస్సులో భాగంగా శనివారం సాయంత్రం ఏర్పాటు చేసే సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీఎం యేగీ ఆదిత్యనాథ్ పాల్గొంటారని కేంద్ర మంత్రి తెలిపారు. జీ20 దేశాలకు చెందిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రుల జీ20 సమావేశం చారిత్రకమైన, ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో జరగడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. #uttar-pradesh #meeting #kishan-reddy #varanasi #g20-culture-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి