Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!!

ఇంటర్ తర్వాత హోటర్ మేనేజ్ మెంట్ చేస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈరంగాన్ని ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. దేశంలో టాప్ 5 మేనేజ్ మెంట్ కాలేజీలు ఉన్నాయి. జీతాలు కూడా భారీగానే ఉంటాయి.

New Update
Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!!

దేశంలో అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న రంగాల్లో హోటల్ మేనేజ్ మెంట్ ఒకటి. ఈరంగంలో రాణించినవారికి మంచి జీతాలు ఉంటాయి. ఈ రంగాన్ని కేరీర్ గా ఎంచుకుని విజయం సాధించాలంటే కొన్ని స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ లక్షణాలు, లీడర్ షిప్, క్రమశిక్షణ, ఒరిటినాలిటీ అండ్ క్రియేటివిటీ, సమస్యలను పరిష్కరించే సత్తా, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ సామార్య్థాలు వంటివి తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది. అవసరమైన స్కిల్స్,టాప్ కాలేజీలు, అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటో చూద్దాం.

అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే:
హోటల్ మేనేజ్ మెంట్ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే కనీసం ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తర్వాత ఈ స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు చేయాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా హోటల్ మేనేజ్ మెంట్ పై కొన్ని కోర్సులు కూడా చేయవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ హోటర్ మేనేజ్ మెంట్, బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్ మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, బీఏ ఇన్ హోటర్ మేనేజ్ మెంట్, బీబీఏ ఇన్ హాస్పిటాలిటీ ట్రావెల్ మరియు టూరిజం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిప్లొమా స్థాయిలో, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్ అండే కేటరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హౌస్‌కీపింగ్, డిప్లొమా ఇన్ ఏవియేషన్ హాస్పిటాలిటీ మరియు ట్రావెల్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఇన్ టూరిజం మరియు హోటల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఎంఎస్సీ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ హాస్పిటాలిటీ పీజీ కోర్సులు కూడా చేసుకునే అవకాశం ఉంది.

టాప్ 5 మేనేజ్‌మెంట్ కాలేజీలుఇవే:
దేశంలో టాప్ 5 మేనేజ్‌మెంట్ కాలేజీలున్నాయి. అందులో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్-న్యూఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్- బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ సులినరీ ఆర్ట్స్- హైదరాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, వెల్‌కమ్ గ్రూప్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్-మణిపాల్ ఉన్నాయి.

ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా క్లబ్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు కేటరింగ్, ఎయిర్‌లైన్ కేటరింగ్ మరియు క్యాబిన్ సర్వీస్, గెస్ట్ హౌసెస్ సర్వీసెస్, క్రూయిజ్ షిప్ హోటల్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ లాడ్జీలు, కేటరింగ్ డిపార్ట్‌మెంట్స్- షిప్పింగ్ కంపెనీలు, బ్యాంకులు, సాయుధ దళాలు, రైల్వేలు… హోటల్స్ మరియు టూరిజం అసోసియేషన్స్ వీటిల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

టాప్ హోటల్స్ ఇవే:

హోటల్ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేస్తే దేశంలోని టాప్ హోటల్స్ ఉద్యోగం సంపాదించవచ్చు. ప్రధానంగా తాజ్ హోటల్స్, జింజర్ హోటల్స్, ఐటీసీ హోటల్స్, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ఒబెరాయ్ హోటల్స్, శృతి హోటల్స్, లలిత్ హోటల్స్‌లలో ఉద్యోగం చేయవచ్చు. జీతం కూడా భారీ మొత్తంలో ఉంటుంది.

ఇది కూడా చదవండి:  టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు