మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ నుంచి సామాగ్రిని తరలించే యత్నం

శనివారం బషీర్‌బాగ్‌లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో నుంచి కూడా సామాగ్రిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే కార్యాలయంలో మూడో అంతస్థులో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ఉండేది.

New Update
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ నుంచి సామాగ్రిని తరలించే యత్నం

Sabitha Indra Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ మంత్రుల కార్యాలయాల నుంచి ఫైళ్లు, ఫర్నిచర్‌ ఎత్తుకెళ్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న మసాబ్‌ట్యాంక్‌లోని మాజీ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్ అదృశ్యమయ్యాయనే వార్తలు సంచలనం రేపాయి. ఆ తర్వాత బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో నుంచి కూడా సామాగ్రిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే కార్యాలయంలో మూడో అంతస్థులో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఆఫీసు ఉండేది. నాలుగో అంతస్తులో రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక వసతుల కల్పన సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ కార్యాలయానికి ఛైర్మన్‌గా రావుల శ్రీధర్‌ రెడ్డి పనిచేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఎవరి కార్యాలయం నుంచి సామాగ్రి తరలింపు జరిగిందన్నది ప్రశార్థకంగా ఉంది.

Also Read: కాంగ్రెస్ అంటేనే అవినీతి.. కిషన్ రెడ్డి ఫైర్!

నిన్న రెండో శనివారం అయినప్పటికీ.. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress) అధికారంలోకి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. సాయంత్రం 5 తర్వాత బషీర్‌బాగ్‌లో ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన అనంతరం రాజు అనే ఓ వ్యక్తి ఆటోను తీసుకొని వచ్చాడు. ఇద్దరు వేరే వ్యక్తులను బైక్‌పై రప్పించి ఆటోలో సామాగ్రిని తరలించేందుకు ప్లాన్ వేశారు. అయితే అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మీడియాకు ఈ సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు, మీడియా అక్కడికి చేరుకోవడంతో వాళ్లు ఆ ఆటోను అక్కడే వదిలేసి తప్పించుకున్నారు. చివరికి షరీప్ అనే ఉద్యోగి సూచనలతోనే తాము ఆటోలో మూడో అంతస్తు, నాలుగో అంతస్తులో ఉన్న సామాగ్రిని ఆటోలో తరలిస్తున్నామని అక్కడ పట్టుబడ్డ రాజు చెప్పాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతకి ఎలాంటి సామాగ్రి, ఫైల్స్‌ని ఎత్తుకెళ్లారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: ‘పనికి మాలిన వ్యక్తులు..’ కలెక్టర్, సీపీపై తుమ్మల ఘాటు వ్యాఖ్యలు!'

Advertisment
Advertisment
తాజా కథనాలు