National: జయ్‌శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం

కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్‌లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు.

New Update
National: జయ్‌శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం

P. chidambaram: లోక్‌సభ ఎన్నికల ముందు భారత్, శ్రీలంకల బోర్డర్ అయిన కచ్చదీవి పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..అసలు ఆ విషయమే తమకు తెలియదని డీఎంకే చెబుతోంది. దానికి తోడు విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. కచ్చదీవి గురించి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించింది బీజేపీ. ప్రధాని మోదీ ఈ విషయం మీద స్పందించారు. సోషల్ మీడియాలో ఈ విసయమై కాంగ్రెస్‌ను తిట్టిపోశారు.

జైశంకర్ వ్యాఖ్యలు...

ప్రధాని తర్వాత విదేశాంగ్ మంత్రి ఎన్. జైశంకర్ సైతం కాంగ్రెస్, డీఎంకేల మీద విమర్శలు చేశారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చదీవికు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్‌లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్​ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని అన్నారు. దీని మీద పరిష్కారం కనుగొనేందుకు శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఆర్టీఐలో సమాధానం సరిగ్గా చదవాలి..

ఎన్. జైశంకర్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబర్ రియాక్ట్ అయ్యారు. ఊపరవెల్లిలా రంగులు మారుస్తున్నారు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్‌ ఫర్‌ ట్వీట్‌ అనేది ట్వీట్ కొత్త ఆయుధం అంటూ కామెంట్ చేశారు. దాంతో పాటూ ఆర్టీఐ యాక్ట్‌ను సరిగ్గా గమనించాలి అని బీజేపీకి చురకలు పెట్టారు. 2015, జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధాన్ని ఒకసారి బాగా గమనించాలని అన్నారు. అందులో కచ్చదీవి శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్టీఐ సమర్ధించిందని చిదంబరం గుర్తు చేశారు. మరో ట్వీట్‌లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారు నిజమే కానీ..మరీ భారత్ బంధించిన మత్స్యకారుల మాటేంటి అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలోనూ మత్స్యకారులు బంధించబడ్డారు...దాన్నేమంటారని అడిగారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో పాటూ విదేశాంగ మంత్రి ఎన్.జైశంకర్ మఈద కూడా కౌంటర్లు వేశారు చిదంబరం.

రాజకీయ నాయకుల సంగతి...వారి కోట్లాట ఎలా ఉన్నా..జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే మంచిదని డిమాండ్ చేస్తున్నారు. తమిళ జాలర్ల ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు అంటున్నాయి.

Also Read:Stock markets: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి..నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు