Abortion Is Legal : చరిత్రలో ఇదే తొలిసారి.. అబార్షన్ హక్కులను లీగల్ చేసిన మొదటి దేశం! By Bhavana 05 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Abortion : చాలా దేశాల్లో అబార్షన్(Abortion) అనేది చట్టవిరుద్దం. ఒకవేళ చట్టబద్ధత ఉన్నా రాజ్యంగబద్ధత లేకుండా అబార్షన్ హక్కు ఉంటుంది. అయితే చరిత్రలో తొలిసారి అబార్షన్‌కు రాజ్యంగబద్ధత కల్పించింది ఫ్రాన్స్(France). విప్లవాలకు, పోరాటాలకు పుట్టిన దేశమైన ఫ్రాన్స్‌లో గర్భస్రావాన్ని మహిళల హక్కు(Abortion Is Women's Right) గా మార్చారు. ఈ బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ ను రాజ్యాంగంబద్ధత ఇచ్చిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ బిల్లును ఫ్రెంచ్ పార్లమెంట్ లోని సభ్యులు ఏకంగా 780-72 ఓట్ల తేడాతో ఆమోదించారు. క్రిస్టియన్ దేశాల(Christian Countries) లో తమ మత గ్రంథాల ప్రకారం అబార్షన్ చేయించుకోవడం అనేది పెద్ద నేరం. ఏ సందర్భంలోనూ గర్భస్రావం చేయించుకోవడానికి చాలా దేశాలు అంగీకరించవు. దీని కారణంగా చాలా మంది మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే అబార్షన్ హక్కును కల్పించాలంటూ మహిళలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి అబార్షన్ హక్కుకు ఇప్పుడు రాజ్యంగబద్ధ కల్పించినప్పటికీ ఫ్రాన్స్ లో చాలా కాలం నుంచే అబార్షన్లు కొనసాగుతున్నాయి. అబార్షన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఫ్రాన్స్ అంతటా సంబరాలు నెలకొన్నాయి. బిల్లుకు చట్టపరమైన రూపం ఇచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. దీని గురించి ఫ్రెంచ్ దిగువ సభ స్పీకర్ యాయోల్ బ్రాన్-పివెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్టెప్ తీసుకున్న మొదటి దేశం ఫ్రాన్స్ అని తెలిపారు. తమ ప్రాథమిక చట్టంలో గర్భస్రావ హక్కును పొందుపరిచిన పార్లమెంట్ ను చూసి గర్వపడుతున్నట్లు ఆయన వివరించారు. అదే సమయంలో, బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ.. మహిళలందరికీ ఇక నుంచి తమ గర్భం విషయంలో తామే నిర్ణయం తీసుకునే హక్కు ఉందని వివరించారు. అయితే ఇదిలా ఉంటే.. అబార్షన్ వ్యతిరేక సంస్థలు, కార్యకర్తలు బిల్లును ఆమోదించడానికి పార్లమెంటు నిర్ణయాన్ని విమర్శించాయి. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని ఉపయోగిస్తున్నారని చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లో అబార్షన్ చేసుకోవడానికి ఇప్పటికే చట్టబద్ధమైన హక్కు ఉంద.. 1974 నుంచి మహిళలకు అబార్షన్ చేసే చట్టబద్ధమైన హక్కు ఉంది కదా అని గుర్తు చేస్తున్నాయి. Also Read : మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను తప్పక దానం చేయండి.. మహాదేవుని అనుగ్రహాం పొందండి! #france #abortion #womens-right #legal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి