Ration Card: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!!

New Update
Financial Decisions: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!!

మీకు తెల్ల రేషన్ కార్డు(White ration card) ఉందా? మీకు శుభవార్త. ఏంటా వార్త అని ఆలోచిస్తున్నారా?తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు కొన్ని ఫ్రీ సర్వీసులను పొందవచచు. ఎలా అనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెక్నాలజీ రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతుంది. అరచేతిలోనే అద్భుతాలను చూపిస్తోంది. బయట ప్రపంచాన్ని కూడా ఇంట్లోనే కూర్చుండి చూడవచ్చు. ఎక్కడేం జరిగినా నిమిషాల్లోనే మీ ముందుకు ఉంచుతున్నాయి మొబైల్ ఫోన్లు.

అదే టెక్నాలజీతో మొబైల్ కు బానిసలవుతున్న వారినీ చూస్తున్నాం. సరదా కోసం కొందరు ఫోన్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే..ఇందుకు భిన్నమైన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిని పరిగణలోనికి తీసుకుని గ్రామీణ యూనియన్ బ్యాంకు (Grameen Union Bank)నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది. ఇందులో ఆసక్తిచూపి ముందుకు పోయినవారికి ఉన్నచోటే ఉపాధి సంపాదించుకోవచ్చు. తిరుపతిలోని చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ(Chandragiri Union Bank Rural) స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 17వ తేదీ నుంచి నెలరోజుల పాటు ఫొటో గ్రఫీ, వీడియో గ్రఫీల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు తెలిపారు.

రేషన్ కార్డు ఉండాల్సిందే:
అయితే ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 నుంచి 45 ఏళ్ల వయస్సున్న పురుషుల, స్త్రీలు ఫ్రీగా శిక్షణ తీసుకునేందుకు అర్హులు అవుతారు.

విద్యాభ్యాసం:
ఇందులో శిక్షణ తీసుకోవాలంటే కనీసం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఫ్రీ భోజనం, రానుపోను ఒకేసారి ఛార్జీలు ఇస్తామని నిర్వహకులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత వారికి సర్టిఫికేట్లు కూడా అందజేస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీలు నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతోపాటు సంస్థలో పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారు ఉచితంగానే ట్రైనింగ్ తీసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 11 - 48 ద్వారకా నగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర ) కొత్తపేట చంద్రగిరి 7989680587, 9494951289, 6301717672 నంబర్లలో సంప్రదించవచ్చని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

ఇది కూడా చదవండి:  ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త…రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు