/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/diyas-jpg.webp)
దీపావళి పండుగ అంటేనే సరదాల పండుగ...పిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటలో కూడా బాంబులు మోగాల్సిందే. అలాంటి దీపావళి పండుగ నాడు మందుబాబులు ఓ చుక్కేసి పటాకులు కాల్చితే ఇక ఎలా ఉంటుంది చెప్పడానికి కూడా మాటలు రావు.
తెలంగాణలోని రామగుండంలో దీపావళి పండుగను కార్మికులు అందరూ ఆనందంగా జరుపుకోవాలని సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్ కింద నెలనెలా కార్మికులకు భారీ ఆఫర్ ఇస్తుంది. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఎవరికైనా సరే బాంబులు కొనాలంటే..ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ ఏడాది పటాకులు పెద్దగా కొనాల్సిన పని లేదు.
అసలే ఎన్నికల సమయం కావడంతో ఓటర్లను ఎలా మచ్చిక చేసుకోవాలో అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో దీపావళి రావడం వారికి బాగా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే టపాసులు బయట కొనాలంటే మినిమం రూ. 1000 లేనిదే రావడం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తించిన రాజకీయ పార్టీల నాయకులు తమ డివిజన్ల పరిధిలోని ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టపాసులు గాలం వేస్తున్నారు.
రామగుండం నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి అభ్యర్థుల అనుచరులు తమకు ఓటేసేవారు ఎవరో ముందుగానే గుర్తించి వారికి నేరుగా బాంబులను నజరానాగా అందిస్తామని ముందే మాట తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బిర్యానీలు, ఐస్ క్రీములు మాత్రమే ఫ్యామిలీ ప్యాక్ లు ఉండేవి..ఇప్పుడు తాజాగా పటాసులు కూడా చేరాయి.
ఒక్కో కుటుంబానికి ఫ్యామిలీ ప్యాకేజీ కింద పటాకులు కుటుంబానికి పంపుతున్నారు. అయితే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పై ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారులు తీవ్రంగా నిఘా పెంచడంతో అనుచరులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముందుగానే మద్యం షాపుల వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకొని టోకెన్ పద్దతిలో తమ ఓటర్లు వస్తే ఉచితంగా మద్యం కూడా ఇవ్వాలని టోకెన్ సిస్టంకు తెరలేపినట్లు సమాచారం.
Also read: దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా..అవి ఎక్కడ ఉంచాలంటే!
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు.
Kishan Reddy Vs Revanth
HCU భూముల విషయంతో తాను షేర్ చేసిన వీడియోలపై కేసు పెడతానంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను కేసులకు భయపడనన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఇతర పార్టీల ఓటర్లను కూడా కలిసి వారి మద్దతు కూడగడతామన్నారు. మజ్లిస్ పార్టీ మెల్లిగా పెరుగుతుందన్నారు. పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం కొత్త సిటీలో సీట్లు గెలుస్తోందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీతో ఎంఐఎం జతకట్టి బలోపేతం అవుతోందన్నారు.
వక్ఫ్ పేరుతో వ్యాపారం..
వక్ఫ్ బోర్డు పేరుతో వ్యాపారం చేసే వారే వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాని మండిపడ్డారు కిషన్ రెడ్డి. నిరసనలో సామాన్య ముస్లింలు ఎవరూ పాల్గొనడం లేదన్నారు. తాము తెచ్చిన కొత్త వక్ఫ్ చట్టంతో ఎవరికీ నష్టం లేదన్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యే అవకాశం లేకుండా.. గజం భూమి అన్యాక్రాంతం కాకుండా కొత్త చట్టం తెచ్చామన్నారు.
(telugu-news | telugu breaking news | kishan-reddy | revanth-reddy)