Telangana: గృహజ్యోతి అమలులోకి వచ్చేసింది..

తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చేసింది. అర్హులకు విద్యుత్తు సిబ్బంది జీరో బిల్లు ఇస్తున్నారు. ఫస్ట్ జీరో బిల్లు ఇదే అని అధికారులు చూపిస్తున్నారు కూడా.

New Update
Telangana: గృహజ్యోతి అమలులోకి వచ్చేసింది..

200 Units Free Current: తెలంగాణలో విద్యుత్ వెలుగులు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ఈరోజు నుంచి అమలులోకి వచ్చేసింది. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించిన కుటుంబాలకు జీరో బిల్లులను జారీ చేస్తున్నారు విద్యుత్ సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు బిల్లులు జారీని ప్రారంభించారు. జీరో బిల్లు బిల్లింగ్‌ కోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలను విద్యుత్‌శాఖ కొనుగోలు చేసింది. అన్ని సెక్షన్లలో ఈరోజు నుంచి జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

ఇవన్నీ ఉండాల్సిందే…

గృహజ్యోతి పథకానికి(Gruha Jyothi Scheme) తెలంగాణ ప్రభుత్వం ఈ షరుతులు వస్తాయని చెబుతోంది. అందులో గత ఏడాది వాడిన కరెంట్‌కు 10 శాతం ఉచిత కరెంట్ కింద ఇస్తామని తెలిపింది. దాంతో పాటూ నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితి దాటని వారికే పథకం అమలు వర్తిస్తుందని చెబుతోంది. నెల వినియోగం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు తెల్లరేషన్‌ కార్డు(White Ration Card) ఉన్నవారే పథకానికి అర్హులు అని కూడా చెబుతోంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింకై ఉండాలని తెలపింది. ఈ నిబంధనలు అన్నీ ఉన్నవారికే గృహజ్యోతిని ఇస్తామని స్పష్టం చేసింది.

ర్హత ఉంది..కానీ సున్నా బిల్లు రాలేదా..

200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతూ ఉండి, వైట్ రేషన్ కార్డున్నా జీరో విద్యుత్ బిల్లు రాకపోతే ఏం చేయాలో కూడా ప్రభుత్వం సూచనలిస్తోంది. జీరో బిల్లు రాకపోతే దగ్గరలో ఉన్న మున్సిపల్, మండల కార్యాలయాలకు వెళ్ళి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇలా చేసుకున్నప్పుడు రేషన్ కార్డ్, దానికి లింక్ చేసి ఉన్న ఆధార్ కార్డ్, విద్యుత్ కనెక్షన్ల నెంబర్‌ను సమర్పించాలి. వీటన్నింటినీ సబ్‌మిట్‌ చేశాక విద్యుత్ సిబ్బంది అర్హుల జాబితాలో పేరును చేరుస్తారని చెబుతోంది.

 ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల లెక్కలు ఇవే…

గృహజ్యోతి కోసం ఇప్పటివరకు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డు ఉన్న వారి దరఖాస్తుల సంఖ్య 64 లక్షలుగా ఉంది. మళ్ళీ వీరిలో 34లక్షల 59 వేల 585 మందికి మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని గవర్నమెంట్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక గృహజ్యోతి పథకం అమలుకు రూ.4వేల 164 ఖర్చు అవుతుందని తెలిపారు.

Also Read:Hyderabad: డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌లు…విదేశాలకు పరారయిన నిందితులు

Advertisment
Advertisment
తాజా కథనాలు