IPL Cricket: ఆసక్తికరంగా ఐపీఎల్2024..ప్రస్తుత ఫ్రాంఛైజీల పరిస్థితి ఇదీ..

New Update
IPL Cricket: ఆసక్తికరంగా ఐపీఎల్2024..ప్రస్తుత ఫ్రాంఛైజీల పరిస్థితి ఇదీ..

నిన్నటితో ఇచ్చి పుచ్చుకోవడాలు అయిపోయాయి. ఐపీఎల్ 2024కి సంబంధించి ప్లేయర్ల రిలీజ్, రీటెన్షన్ కు నిన్న ఆకరు తేదీ. అది కాస్త అయిపోవడంతో అన్ని ఫ్రాంఛైజీలు తమ టీమ్ పూర్తి వివరాలు చెప్పాయి. ఎవరెవరు ఎవరెవరిని వదిలేసారు, నిలబెట్టుకున్నారు, రప్పించారు అన్నదాని మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దాంతో పాటూ బడ్జెట్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ పర్స్ తో ఇంకా ఎంత మందిని తీసుకోవచ్చు అన్న లెక్కలు కూడా తేలాయి.

Also Read:ఒప్పందం పొడిగిస్తే బావుంటుంది-జో బైడెన్

చెన్నై సూపర్ కింగ్స్..
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 ఇందులో14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 68.6 కోట్లు కాగా ఇంకా పర్స్‌లో 31.4 కోట్లు మిగిలి ఉంది.దీంతో 6 మంది ప్లేయర్లను తీసుకోవచ్చును. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్ళని కూడా తీసుకోవచ్చును.

ఢిల్లీ క్యాపిటల్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-16. ఇందులో12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 71.5 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 28.95 కోట్లు. దీంతో ఇంకా 9మందిని తీసుకోవచ్చును.

గుజరాత్‌ టైటాన్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18. ఇందులో 12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 76.85 కోట్లు. పర్స్‌లో మిగిలిన మొత్తం 23.15 కోట్లు. దీంతో 7 మంది ఆటగాళ్ళను తీసుకోవచ్చును.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13. ఇందులో 9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు.ఇప్పటి వరకు ఖర్చు చేసింది 67.3 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 32.7 కోట్లు. దీంతో 12మంది ప్లేయర్స్ ను తీసుకోవచ్చును.

లక్నో సూపర్‌ జెయింట్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19. ఇందులో 13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు.ఇప్పటి వరకు ఖర్చు చేసింది 86.85 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 13.15 కోట్లు.

ముంబై ఇండియన్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17. ఇందులో12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు.ఇప్పటి వరకు ఖర్చు చేసింది 84.75 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 15.25 కోట్లు. ఇంకా 8 మందిని తీసుకోవచ్చును.

పంజాబ్‌ కింగ్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17. ఇందులో 11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 70.9 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 29.1 కోట్లు. దీంతో ఇంకా 8 మంది ఆటగాళ్ళను తీసుకోవచ్చును.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 59.25 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 40.75 కోట్లు. దీంతో 7 మందిని తీసుకోవచ్చును.

రాజస్థాన్‌ రాయల్స్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17. ఇందులో 12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 85.5 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 14.5 కోట్లు. ఇంకా 8 మంది ప్లేయర్స్ ను తీసుకోవచ్చును.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19. ఇందులో 14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 66 కోట్లు కాగా పర్స్‌లో మిగిలిన మొత్తం 34 కోట్లు. దీంతో ఆరుగురు ఆటగాళ్ళను కొనుక్కోవచ్చును.

వచ్చే నెలలో ఐపీఎల్ వేలం ఉంటుంది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న వేలం జరగనుంది. ఈ వేలంలో కొత్త ఆటగాళ్ళను తీసుకోవచ్చును.

Advertisment
Advertisment
తాజా కథనాలు