Kolkata Doctor Case:ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో ట్విస్ట్‌.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

హత్యాచారానికి గురైన జూనియర్‌ డాక్టర్‌ శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు వచ్చిన వార్తలను కోల్‌కతా పోలీస్‌ చీఫ్ వినేశ్‌ గోయల్‌ ఖండించారు. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

New Update
Kolkata Doctor Case:ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో ట్విస్ట్‌.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనపై వస్తున్న పలు వార్తలను కోల్‌కతా పోలీసులు ఖండించారు. ఈ సందర్భంగా కోల్‌కతా పోలీస్‌ చీఫ్ వినేశ్‌ గోయల్‌ మాట్లాడారు. '' జూనియర్ డాక్టర్ పోస్టుమార్టం ప్రక్రియ మేజిస్ట్రేట్ ఎదుట జరిగింది. దానిని మొత్తం వీడియో తీశారు. ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: వైద్య సిబ్బందిపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు

శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు రాసుకొచ్చారు. ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారని పలు కథనాలు. కానీ ఇందులో వాస్తవం లేదు. ఇలాంటి సమాచారం వాళ్లకి ఎక్కడదొరుకుతుందో అర్థం కావడం లేదు. వివిధ రూపాల్లో ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. మృతి ఘటనలో ఎలాంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీసులు ముందుగా దాన్ని అసహజ మరణంగా నమోదు చేస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా లేదా పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా అది హత్యా లేదా ఆత్మహత్య అనేది ప్రస్తావిస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పుడు అసహజ మరణం కేసు నమోదు చేయడం సహజం. మేము అసహజ మరణంగా నమోదు చేసి, ఆత్మహత్యగా చూపించాలనుకుంటున్నామని ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదని'' వినేశ్‌ గోయల్‌ అన్నారు.

ఇదిలాఉండగా.. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్‌ ఇటీవల RG కర్ మెడికల్ ఆస్పత్రిలో రాత్రి విధుల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సెమినార్‌ హాల్‌లో ఆమె అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజయ్‌ రాయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జి కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్నారు.

Also Read: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు

Advertisment
Advertisment
తాజా కథనాలు