Viral News: ఆన్‌లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియోలు.. నలుగురు విద్యార్థులు సస్పెండ్! రాజస్థాన్-జోధ్‌పూర్‌లో ఆన్‌లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో నలుగురు విద్యార్థులు అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. దీంతో నలుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. By Trinath 17 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Porn Plays During Online Class in Rajasthan's Jodhpur: అడ్డమైన పనులు చేయడం.. చిల్లరగా బిహేవ్ చేయడం.. పోకిరి చేష్టలు చేసి సస్పెండ్ కావడం కొంతమంది విద్యార్థులకు అలవాటు. అసలు కొంతమంది ప్రవర్తన చూస్తే చికాకు పుడుతుంది. అసహ్యం వేస్తుంది. స్కూల్ పిల్లల్లా అసలు నడుచుకోరు. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులను మిస్‌యూజ్ చేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియో ఆఫ్ చేసుకోని ఇష్టమైన పనులు చేస్తుంటారు కొందరు. ఇక్కడివరకు ఏదోలే అనుకోవచ్చు కానీ తాజాగా రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన చూస్తే పిల్లల మైండ్ ఎలా పాడవుతుందోనన్న ఆందోళన కలుగుతోంది. క్లాస్ జరుగుతుండగా అశ్లీల వీడియోలు: లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్ తరగతుల ట్రెండ్ బాగా పెరిగింది. ఇక తాజాగా రాజస్థాన్(Rajasthan)లోని జోధ్‌పూర్(JodhPur)లో ఆన్‌లైన్ క్లాస్ సందర్భంగా నలుగురు విద్యార్థులు చేసిన చేష్టలు చర్చనీయాంశంగా మారాయి. ఆన్‌లైన్ తరగతుల సమయంలో అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. శీతాకాలపు సెలవులను జనవరి 14 వరకు పొడిగించిన తర్వాత, పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించింది. జనవరి 10న, ఆన్‌లైన్ క్లాస్ సమయంలో, అకస్మాత్తుగా అసభ్యకరమైన వీడియోతో పాటు కొన్ని అసభ్యకరమైన సందేశాలు ప్లే అయ్యాయి. జనవరి 14 వరకు ఇలానే కొనసాగింది. ఆన్‌లైన్ తరగతుల ప్లాట్‌ఫారమ్‌ను మార్చినప్పటికీ ఈ ధోరణి ఆగలేదు. అనుమానం వచ్చి ఏం చేశారంటే? ఆ తర్వాత కొంతమంది విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. ఆ తర్వాత జనవరి 15న విద్యార్థులను పాఠశాలకు పిలిపించి వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా.. నలుగురు విద్యార్థులు ఒక గ్రూపుగా ఏర్పడి అందులో ఉపాధ్యాయులపై అసభ్యకర వ్యాఖ్యలతో సందేశాలు కూడా పంపినట్లు తేలింది. విద్యార్థులు టెలిగ్రామ్‌లోని గ్రూప్‌లో ఆన్‌లైన్ క్లాస్ లింక్‌ను షేర్ చేశారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు నమ్మలేదు. నిబంధనల ప్రకారం నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తమ మొబైల్‌లో ఏం చేస్తున్నారో గమనించాలని కోరుతున్నారు. Also Read: అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా! WATCH: #viral-news #rajasthan #jodhpur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి