Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి

బహిష్కృత టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లారు. ఆమె వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికే మహువా బంగ్లా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఆమె న్యాయవాది తెలిపారు.

New Update
Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి

Notice To Mahua : ఇటీవల టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా(Mahua Moitra) లోక్‌సభ(Lok Sabha) నుంచి బహిష్కరణ కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల పలుమార్లు అధికారులు.. ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపారు. ఇక చివరికి ఆమె ప్రభుత్వ బంగ్లాను విడిచి వెళ్లక తప్పలేదు. మహువా ఎంపీగా ఉన్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది.

గతంలోనే నోటీసులు

దీంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ (DoE) విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే మహువా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన వెళ్లిపోయినట్లు ఆమె న్యాయవాది తెలిపారు. డిసెంబర్ 8న మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దు కాగా.. జనవరి 7వ తేదీ లోపు ఆమెకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ గతంలో నోటీసులు జారీ చేశారు. దీంతో మహూవా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) లో పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆమె పిటిషన్ తిరస్కరించింది.

Also Read : Andhra Pradesh:ఆంధ్రాలో కులగణన ప్రారంభం

అధికారులు రాకముందే ఖాళీ

దీంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ మహువాపై చర్యలకు దిగింది. అధికారులు రావడానికి ముందే ఆమె బంగ్లాను ఖాళీ చేసి వెళ్లిపోయారని.. ఎలాంటి బలవంతం జరగలేదని.. ఆ ఇంటి తాళాలు డీవోఈ అధికారులకు అప్పగించామని ఆమె న్యాయవాది షాదాన్‌ ఫరాసెత్ పేర్కొన్నారు.

రూల్స్ బ్రేక్‌

ఇదిలా ఉండగా.. ఇటీవల లోక్‌సభలో అదానీ గ్రూప్స్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందని నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా సభా ధిక్కరణకు పాల్పడ్డారంటూ వెల్లడించింది. రూల్స్‌ను బ్రేక్‌ చేసి పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులను ఇచ్చానట్లు కమిటీ నిర్ధారించింది. ఇక చివరికి లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు