Greg Chappell: తీవ్ర కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్..నిధులు సేకరిస్తున్న స్నేహితులు ఒకప్పుడు గొప్ప బ్యాట్స్ మెన్. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అంతకు మించి వివాదాలను కూడా నెత్తినవేసుకున్నాడు గ్రెగ్ చాపెల్. ఆడుతున్నప్పుడు గొప్పగా బతికిన ఈయన ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలం వెళ్ళదీస్తున్నాడు. By Manogna alamuru 27 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి గ్రెగ్ చాపెల్...ఈయన పేరు చెబితే చాలు భారత క్రికెట్ అభిమానులు ఉలిక్కి పడతారు. రెండేళ్ళ పాటు టీమ్ ఇండియాను నానా ఇబ్బందులు పెట్టిన గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియన్ దిగ్గజ బ్యాట్స్ మెన్ లో ఒకరు. చాపెల్..2005 నుంచి 2007 వరకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించారు. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో గ్రెగ్ చాపెల్ గొడవలు అందరికీ తెలిసిందే. అయితే గ్రెగ్ కు గొప్ప బ్యాట్స్ మన్ గా పేరుంది. అంతకు మించి వివాదాలూ ఉన్నాయి. ఆడుతునన్నాళ్ళూ.. తర్వాత కూడా బాగా బతికిన గ్రెగ్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. Also Read:తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం…పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ టీమిండియా కోచ్ గా వైదొలిగాక... చాపెల్ ను ఎవరూ దగ్గరికి రానివ్వలేదు. అతని తరంలో కొంతమంది కామెంటేటర్లుగా, మరికొందరు మరికొన్ని క్రికెట్ సంబంధిత వృత్తుల్లో బిజీగా ఉండగా చాపెల్ మాత్రం నోటి దురుసుతనంతో అందరినీ దూరం చేసుకున్నారు. దాంతో ఆయన ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అతడిని ఆదుకునేందుకు స్నేహితులు ఆన్‌లైన్‌లో నిధుల సేకరణకు సిద్ధమయ్యారు. అతడి కోసం నిధులు సేకరించేందుకు స్నేహితులు గో ఫండ్ మి పేరిట ఆన్ లైన్ లో నిధులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన స్నేహితులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి గ్రెగ్ చాపెల్ తో పాటూ అతని ఇద్దరు సోదరులు ఇయాన్ చాపెల్, ట్రెవర్ చాపెల్ కూడా హాజరయ్యారు. గ్రెగ్ చాపెల్ కి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే ఈ కార్యక్రమానికి హాజరయినప్పుడు కూడా తానేమీ మరీ అంత దిగజారిపోలేదని.. అలా అని అద్భుతమైన జీవితాన్ని కూడా గడపడం లేదని అన్నారు. స్నేహితులు చేస్తున్న పని తనకు ఇష్టం లేకపోయినా.. వారి కోసం సరే అన్నానని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్ చేస్తున్న ఈ నిధులను తానొక్కడే కాకుండా...తనలాగా ఇబ్బందులు పడుతున్న మరికొందరు క్రికెటర్లకు కూడా ఇస్తానని చెప్పారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్ తో సంబంధాలు ఉన్నప్పటికీ తను చాలానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. అనేకమంది క్రికెటర్లు కెరీర్ లో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు తాను సాయపడ్డానని, తన వల్ల సాయం పొందిన వారు ఈరోజు తన పరిస్థితిని గుర్తిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత కోచ్ గా వైదొలిగిన తర్వాత గ్రెగ్ చాపెల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరిస్తూ నిరుపేదల కోసం సేవలు అందిస్తూ వస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రస్టును నిర్వహించే వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు నిధులలోని కొంత మొత్తాన్ని వాడుకోవచ్చు. కానీ గ్రెగ్ ది అందులో ఒక్క డాలర్ కూడా ముట్టుకోని వ్యక్తిత్వం కావడంతోనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయని సన్నిహితులు చెబుతున్నారు. గ్రెగ్ ఇంత దయనీయంగా బతకడం తమకు నచ్చలేదని.. అందుకే ఈ పనిని చేస్తున్నామని చెప్పారు. #cricket #australia #funding #gerg-chappell మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి