MUMBAI : మహిళ వద్ద నుంచి రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!

నైరోబీ నుంచి భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్‌తో  అరెస్టు చేశారు. మహిళ లగేజీని తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు ఆమె వద్ద నుంచి సుమారు రూ.19 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

New Update
MUMBAI : మహిళ వద్ద నుంచి రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!

DRI Officers :  ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport) లో ఒక విదేశీ మహిళ వస్తువులపై DRI అధికారులు సోదాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు గుర్తించిన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. మహిళ తన లగేజీలో బూట్లు, మాయిశ్చరైజర్ సీసాలు, షాంపూ ,సెంటు సీసాలను బయట పెట్టిింది. మొదట లగేజీ మొత్తం వెతికారు. ఏమి దొరకపోవటం తో మహిళ బయట పెట్టిన షూ ,షాంపుల పై అధికారులు తనీఖీలు చేశారు.

మహిళ బ్యాగ్‌ లోంచి బయటికి తీసిన వివిధ బాటిళ్లలో, బూట్లలో దాచిన తెల్లటి పొడి లాంటిది కనిపించింది. ఫీల్డ్ టెస్ట్ కిట్ ఉపయోగించి వైట్ పౌడర్ పరీక్షించగా, అది కొకైన్(Cocaine) అని తేలింది. మహిళ బ్యాగ్ నుంచి దాదాపు 1.979 కిలోల వైట్ పౌడర్ అంటే కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Cocaine

Also Read : భర్త హత్యకు పుస్తెల తాడు అమ్మి మరీ సుఫారీ!

ఓ విదేశీ మహిళ బ్యాగ్ నుంచి బయటపడిన కొకైన్ మార్కెట్ విలువ దాదాపు రూ.19.79 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఆ మహిళా అరెస్ట్ చేశారు. డీఆర్‌ఐ అధికారులు  అదుపులోకి తీసుకుని ఆమెను విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు