Big Breaking : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్ ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. By Bhavana 27 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి EVM Violence : ఓటు (Vote) వేసే సందర్భంలో బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎం (EVM) ను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ (Polling) కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. Prashant Jagadev Storms Into Booth, Breaks EVM In a shocking incident, BJP's Khurda MLA candidate Prashant Jayadev stormed into a polling booth in Begunia Assembly Constituency & broke the EVM He reportedly "assaulted" the presiding officer He's now in police custody pic.twitter.com/PFtzDwfGEn — Soumyajit Pattnaik (@soumyajitt) May 25, 2024 ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. చిలికా బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బెగునియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కౌన్రిపట్నలో ఆయన ఓటు ఉంది. కాగా, శనివారం ఆరో దశ పోలింగ్ సందర్భంగా ప్రశాంత్ జగ్‌దేవ్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఈవీఎం మోరాయించడంతో ఓటు వేసేందుకు కాసేపు వేచి ఉన్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి, ఎమ్మెల్యే అభ్యర్థి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపగించిన ప్రశాంత్, టేబుల్‌పై ఉన్న ఈవీఎంను లాగడంతో అది కిందపడి పగిలింది. దీంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. EVM Attack Plot Thickens When Prashant Jagadev's vehicle was intercepted by the police after he broke an EVM at a polling booth in Begunia AC, Aparajita Sarangi was seen sitting in the same vehicle While Prashant is BJP's Khurda MLA candidate, Smt Sarangi is BBSR Lok Sabha… pic.twitter.com/nwllMmHaiO — Soumyajit Pattnaik (@soumyajitt) May 25, 2024 మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ జగ్‌దేవ్ (Prashant Jagadev) పై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఖుర్దా జైలుకు ఆయనను తరలించారు. Also read: నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా? #bjp #evm #odisha #mla-candidate #prashant-jagadev మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి