Health Care: భోజనం తర్వాత కడుపులో మంట పెడుతుందా? ఈ హోం రెమెడీస్ మీ కోసమే! భోజనం తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే సోంపు నీరు తాగవచ్చు. భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే బెల్లం ముక్క తినవచ్చు. ఇక కలబంద జ్యూస్ కూడా మలబద్ధకం లాంటి సమస్యను పరిష్కరిస్తాయి. అయితే డాక్టర్ల సూచన తప్పనిసరి. By Vijaya Nimma 30 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Care: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల ఆహారం అలవాట్లు చాలా మారిపోయాయి. రాంగ్ లైఫ్‌స్టైల్ కారణంగా ప్రజలు శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కడుపు(Stomach)లో మంట, నొప్పి కూడా ఒక సాధారణ సమస్యగా మారిపోయిన పరిస్థితి దాపరించింది. ఈ సమస్య ఎక్కువగా మిరప మసాలా దినుసులు తినడం వల్ల వస్తుంది. అదే సమయంలో కొందరికి కడుపులో గ్యాస్(Gas) సమస్య ఉంటుంది. ఏది తిన్నా జీర్ణించుకోలేక అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి సమస్యను నివారించడానికి డయాజీన్ లేదా ఏదైనా మందులను ఆశ్రయించవచ్చు. డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని ఇంటి చిట్కాలతో కూడా మీ కడుపులోని మంట సమస్యలను తగ్గించుకోవచ్చు. మీ వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులతో దీన్ని పరిష్కరించవచ్చు. కొన్నేళ్లుగా జీర్ణక్రియ సమస్యను నయం చేస్తున్న కొన్ని హోం రెమెడీస్ గురించి మీకు చెబుతున్నాం. సమస్యను నయం చేస్తుంది భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే బెల్లం ముక్క తినాలి. కాసేపు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇవి జీర్ణ ఎంజైమ్స్‌ను విడుదల చేయడానికి సహాయపడతాయి. కడుపులో మంట సమస్యను నయం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సోంపు నీరు మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే వడకట్టాలి. మీరు కూడా దీన్ని మరిగించి తాగవచ్చు. రుచిని బట్టి అందులో ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఎసిడిటీ సమస్యను తొలగించడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను తొలగించడానికి కలబంద జ్యూస్ తాగవచ్చు. ఇది మీ ప్రేగులలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. అలాంటి పరిస్థితిలో మీరు మార్కెట్లో లభించే కలబంద రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. అవి కడుపు చికాకు, నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అటు నిమ్మరసం కూడా ఉదర సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసం కడుపులోని మంటను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: వేయించిన శనగలు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి