Food Poison: ప్రభుత్వ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత..!!

రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
Food Poison: ప్రభుత్వ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత..!!

ఓ ప్రభుత్వ హాస్టల్ ఆహారం తిన్న 30మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫుడ్ ఫాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యలు తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న విద్యార్థులు ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. 30మంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతోపాటు ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందితో ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారమే విద్యార్థినిల అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.

పూర్తివివరాలు చూస్తే...రంగారెడ్డి జిల్లా మంచాల బీసీ బాలికల హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి చదవుతున్న 140మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం కూడా విద్యార్థినులు బ్రేక్ ఫాస్ట్ లో పెట్టిన పులిహోరా తిన్నారు. తిన్న వెంటనే కొందరు విద్యార్థిలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. కొంతమంది పాఠశాలకు వెళ్లారు. వీరిలోనూ చాలా మంది విద్యార్థినిలు కడుపునొప్పి, తలతిప్పడం వంటి సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను దగ్గర ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీని ఏయే దేశాలు అత్యన్నత గౌరవంతో సత్కరించాయో తెలుసా?

30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా...అందులో 8మంది విద్యార్థుల పరిస్థితి క్రిటికల్ గా మారింది. దీంతో వారిని ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం వరకు ఈ విద్యార్థినులంతా కోలుకున్నట్లు తెలుస్తోంది. కాగా పులిహోరలో పురుగులు ఉన్నాయని..అది తిన్నాకే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటున్నారు. తప్పనిపరిస్థితుల్లో ఆ ఆహారం తిన్నామని అందుకే ఇలా జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లె విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

అటు నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్‌ వల్ల సుమారు 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్‌ సిబ్బంది బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కాకతీయ మెడికల్ కాలేజీలో పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు..ఒకరికి గాయాలు..!!

హాస్టల్‌ నిర్వహకులు విద్యార్థునులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పైసలకు కక్కుర్తిపడి నాసిరకమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థినుల ప్రాణాలపైకి వచ్చిందన్నారు. హాస్టల్‌లోని బాలికల ఫుడ్‌ కోసం ప్రభుత్వం ఫండ్స్‌ రిలీజ్‌ చేసినా.. హాస్టల్ సిబ్బంది మాత్రం డబ్బులను పక్కదోవ పట్టిస్తూ కుళ్లిపోయిన టమాటాలు, గుడ్లతో పాటు ఇతర నాసిరక నిత్యావసర సరకులను తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తున్నారన్నారు. దీంతో ఆ భోజనం తిన్న విద్యార్థునులు అస్వస్థతకు గరువుతున్నారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ప్రముఖ రచయిత్రి, సీఎం సోదరి గీతా మెహతా మృతి, ప్రధాని సంతాపం..!!

మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థునుల తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటీన అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న యువతుల ఫెరెండ్స్‌ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొందరు విద్యార్థినులను మహబూబ్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్సత్రికి తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌ సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు