Relationship: అత్తమామలతో బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

ప్రతి కుంటుంబంలోనూ ప్రత్యేక సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వీటిని కచ్చితంగా ఇంటికి వచ్చిన కోడలు గౌరవించాలి. నలుగురి మధ్య మాట్లాడేటప్పుడు అత్త మామల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. అలాగే వాళ్లు చేప్పే మాటలను జాగ్రత్తగా విని పాటించాలి.

New Update
Relationship: అత్తమామలతో బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

Relationship: నేటి కాలంలో బంధంపై ఎవ్వరు అంతగా శ్రద్ధ పెట్టం లేదు. పూర్వంలో బంధాలు అంటే ఓ విలువు, గౌరవం ఉండేది. అయితే పెళ్లితో రెండు జీవితాలు కలవడంతోపాటు.. ఎన్నో బంధుత్వాలను దగ్గరకు చేరుస్తుంది. దీంతో ఓ కొత్త కుటుంబం ఏర్పడుతుంది. పెళ్లి వల్ల ఏర్పడే బంధాల్లో కీలకమైన వారు అత్త, మామలు. అత్తమామలతో ఎంత ప్రేమగా ఉంటే ఆ బంధానికి అంత బలం ఉంటుంది. అలాగే భార్య, భర్తల సమస్యలు ఉన్న కూడా వారు పరిష్కరిస్తారు. జీవితాన్ని సున్నితంగా గడపడానికి శాశ్వత సంబంధాలకు ఎలా పునాది వేయాలి..? అత్తమామలతో మంచి బంధాన్ని ఆందంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అవగాహన ముఖ్యం

  • నలుగురి మధ్య మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఒక ప్రదేశంలో ఉండి మాట్లాడే మాటల్లో అత్త మామల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. పెద్దవారికి గౌరవించడం అనేది రిలేషన్‌ కనెక్షన్‌లో మొదటి భాగం. అలాగే వాళ్లు చేప్పే మాటలను కూడా జాగ్రత్తగా విని పాటించాలి.

సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించండి..

  • ప్రతి కుంటుంబంలో ఓ ప్రత్యేక సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వీటిని ఖచ్చితంగా ఇంటికి వచ్చిన కోడలు గౌరవించాలి. ఈ సాంస్కృతిక పద్ధతులను గౌరవించడం, వాటిలో పాల్గొంనటం వలన కుటుంబ సభ్యులతో కలిసిపోతారు. అలాంటి ఆచారాలు బాగా నచ్చితే.. వాటి గురించి ఎవరిని నొప్పించకుండా మాట్లాడండి. ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు వెళ్తూ ఉండాలి. అక్కడ అందరితో కలిసిమెలిసి సరదాగా ఉంటే అందరికి ఖచ్చితంగా నచ్చుతారు.

ఇది కూడా చదవండి: లేట్‌నైట్ స్లీప్‌తో హెల్త్ రిస్క్.. ఏం జరుగుతుందంటే..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో గొంతు గరగర తగ్గించే చిట్కాలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు