Viral News: ముక్కు కాదు.. కీటకాల పుట్టా.. ముక్కులో 150 పురుగులను చూసి డాక్టర్లు షాక్! ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టేశాయి. రక్తస్రావం అవుతోందని ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి ENT వైద్యుడు అతని ముక్కు లోపల పరీక్షించి చూసి షాక్ అయ్యాడు. బాధితుడి ముక్కు క్లియర్ చేయడానికి ప్రత్యేకమైన యాంటీ పారాసైట్ లిక్విడ్ ఇచ్చారు. By Trinath 24 Feb 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి 150 live bugs in nose: ముందుగా ముక్కు బాగా నొప్పి పుట్టింది.. తర్వాత అందులో నుంచి రక్తం కారింది. కొన్ని రోజుల తర్వాత పెదాలు వాచాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు ముక్కు, నోరు నొప్పులు పెరిగాయి. ఇంతకాలం మనీ ఎందుకు వేస్ట్ చేయడంలే అని లైట్ తీసుకున్న బాధితుడు ఆస్పత్రికి పరుగులు తీశాడు. డాక్టర్లు అతడిని పరీక్షించారు.. ముందుగా ఏమీ అర్థంకాలేదు.. తర్వాత కొన్ని టెస్టులు చేశారు. వాటి రిజల్ట్ చూశాక దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది. ముక్కులో పురుగుల పుట్ట కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. ముక్కులోపల మలవిసర్జన: సుమారు 30 ఏళ్ల క్రితం 'న్యూరోబ్లాస్టోమా' అనే వ్యాధి కారణంగా బాధితుడి రోగనిరోధక శక్తి చాలా బలహీనపడిందని సమాచారం. ఆ తర్వాత అతని ముక్కులో క్యాన్సర్ కణితి ఏర్పడింది. దీన్ని గతంలో డాక్టర్లు తొలగించారు. ఇక 2023లో మొదటిసారిగా బాధితుడికి ముక్కు నొప్పి మొదలైంది. తర్వాత అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో డేవిడ్ కార్ల్సన్ అనే వైద్యుడి వద్దకు అతను వెళ్లాడు. కెమెరాల సాయంతో డాక్టర్ ముక్కు లోపలికి చూశాడు. వెంటనే డాక్టర్ షాక్ అయ్యాడు. బాధితుడు ముక్కు లోపల కీటకాలు కనిపించాయి. నిజానికి, కీటకాలు ముక్కు లోపల ఉన్న కణజాలాలను తిన్నప్పుడు అవి కూడా మలవిసర్జన చేస్తాయి. ఇది ముక్కులోపల విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది వాపుకు కారణమవుతుంది. ఎలా కోలుకుంటాడు? బాధితుడికి ముక్కు క్లియర్ చేయడానికి ప్రత్యేకమైన యాంటీ-పారాసైట్ లిక్విడ్ ఇచ్చారు. అంతే కాకుండా ఏడాది పాటు క్రమం తప్పకుండా డాక్టర్ వద్దకు వెళ్లి ముక్కును పరీక్షించుకోవాల్సి ఉంటుంది. రోగి ముక్కు సమస్య నయం కావడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. Also Read: అస్థిపంజరంతో ఐదేళ్లు.. తమ్ముడి డెబ్ బాడీని ఇంట్లోనే దాచుకున్న అక్క! WATCH Shaitaan Trailer: #viral-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి